ఈరోజు 14 వైద్య కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్. ఒకేసారి 14 వైద్య కళాశాలల పనులకు శ్రీకారం చుట్టనున్నారు. క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు సీఎం. నాడు–నేడుతో వైద్య, ఆరోగ్య రంగంలో పెను మార్పులు తేవడానికి సిద్ధమై మొత్తం 16 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పులివెందుల, పాడేరు కాలేజీల పనులు ప్రారంభం అయ్యాయి. అత్యాధునిక వసతులతో వైద్య కళాశాలల నిర్మాణం జరుగుతుంది. ప్రతి వైద్య కళాశాలతో పాటు, నర్సింగ్ కళాశాలలు కూడా ప్రారంబివహం కానున్నాయి. 2023 చివరి నాటికి కొత్త వైద్య కళాశాలల నిర్మాణం పూర్తి చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది.