కులగణనపై సీఎం జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని అందరూ అభినందిస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. బీహార్‌లో కులగణనకు రాజకీయ కోణం ఉందని ఆయన అన్నారు.
విశాఖపట్నంలో జరిగిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. దశాబ్దాలుగా బడుగు బలహీనర్గాల వారు సంక్షేమం, అభివృద్ధికి దూరంగా ఉన్నారని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు మైనార్టీలను టీడీపీ కూరలో కరివ�
కర్నూలు జిల్లా పత్తికొండలో సామాజిక సాధికారక బస్సు యాత్రలో ఉపముఖ్యమంత్రి అంజద్ భాష , మంత్రులు ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మీడియా సమావేశంలో మాట్లాడారు.
అమరావతిలోని సెక్రటేరియట్‌లో 'జగన్మోహనం.. అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు తమ చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఏపీలో బీసీ సమస్యలపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీలో జరుగుతోన్న బీసీ కులగణనపై అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల ఓట్లు తొలగించి, వారి పథకాల్లో కోత పెట్టేందుకే కులగణన పేరుతో వైసీపీ ప్రభుత్వం సర్వే చేస్తోందని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఆరోపించారు.
ప్రతిపక్షాలు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని.. అది తప్పు అని చెప్పడానికే ఈ సభ ఉద్దేశమని విజయనగరం జిల్లా రాజాంలో సామాజిక సాధికారిక యాత్రలో స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. జగన్మోహన్ రెడ్డి సామాజిక, సాధికారిక జైత్రయాత్ర ఇది అంటూ ఆయన పేర్కొన్నారు. జోగులు అందరివాడు.. సామాన్య జనంతో కలిసిపోయే �
ఈ జన వాహిని చూస్తుంటే వైసీపీ గెలుపు ఖాయం అనిపిస్తోందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట బస్సుయాత్ర బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. ఇసుకరాలనంత జనాలు సభలకు రావడం జగనన్న విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మూడు ప్రాంతాలనుండి మూడు సామాజిక రథాలు ప్రజల వద్దకు వస్తున్నాయని మంత్రి జోగి రమేష్ అన్నారు. జగనన్న కటౌట్ పెట్టి బస్ యాత్ర చేస్తేనే గ్రామాలు, పట్టణాలు, జన సంద్రంగా మారుతున్నాయన్నారు.
వరుస కార్యక్రమాలతో దూసుకుపోతోన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. నేటి నుంచి మరో క్యాంపెయిన్ చేపట్టనుంది. నేటి(గురువారం) నుంచి వైసీపీ.. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో సచివాలయ పరిధిలో ఈ క్యాంపెయిన్ కొనసాగనుంది. గత నాలుగున్నరేళ్ల పాలనలో చేసి