వచ్చే ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ పేర్కొన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు.
రాజమండ్రిలోని సెంట్రల్ జైలులో చంద్రబాబు ఉంటున్న బ్యారెక్‌లో ఎట్టకేలకు టవర్ ఏసీ ఏర్పాటు చేయడం మాత్రమే సరిపోదని బాడీ చెకప్ చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సామర్లకోట పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ వద్ద వివిధ వైద్య అవసరాల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి ఆర్థిక సహాయం కోరుతూ ముఖ్యమంత్రికి వినతులు అందించగా.. తప్పకుండా ఆదుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను వీఆర్‌ఏ సంఘం నాయకులు కలిసి కృతజ్ఙతలు తెలిపారు. రద్దు అయిన డీఏను పెంచి మరీ ఇస్తుండడంపై సీఎంను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈనెల 26 నుంచి ఉత్తరాంధ్రలో మొదటి దశ బస్సు యాత్రకు వైఎస్సార్‌సీపీ శ్రీకారం చుట్టనుంది. ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. 13రోజుల పాటు ఉత్తరాంధ్రలో సామాజిక న్యాయ బస్సు యాత్ర జరగనుందని మంత్రి వెల్లడించారు.
ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసెస్ చేయాలనే ఆశావహులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సివిల్ సర్వీసెస్ అస్పిరెంట్సుకు ఆర్థిక సాయం జగన్ సర్కార్ చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టెక్ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని కలిశారు. ఏపీలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో మూడు 5 స్టార్ నుంచి 7 స్టార్ హోటల్స్ నిర్మాణానికి మహీంద్ర గ్రూప్ సంసిద్దత వ్యక్తం చేసింది.
ప్రజలు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకునే విషయంలో ప్రభుత్వం మరింత వెసులుబాటు కల్పించింది. ఒకసారి కుల ధ్రువీకరణ పత్రం జారీ చేస్తే దానిని శాశ్వతంగా పరిగణించాలని అన్ని ప్రభుత్వ శాఖలకు స్పష్టం చేసింది.