రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో వచ్చిన పెట్టుబడులపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పోలవరం పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 6న పోలవరం ప్రాజెక్టును జగన్ సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై అధికారులకు కీలక సూచనలు చేయనున్నారు. సీఎం జగన్ ప్రత్యేక హెలికాప్టర్‌లో అమరావతి నుంచి ఉదయం 10.15 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు.
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీఎం వైయస్.జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎంఓ కార్యాలయ అధికారులతో కలిసి.. ఈ ప్రమాద ఘటనపై ఆయన సమీక్షించారు. తాజా సమాచారం ప్రకారం 237 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. క్షతగాత్రుల సంఖ్యకూడా భారీగా ఉందని వివరించారు.
ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 233 మందికిపైగా చనిపోయారని తాజా సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తంచేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్సార్ బీమా పథకం నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 7వ తేదీ వరకు ఇది కొనసాగనుంది. ఈ పథకం ద్వారా 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తూ మరణిస్తే కుటుంబసభ్యులకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందిస్తుంది.
గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించారు. రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను సీఎం జగన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రూ. 361.29కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను రైతు గ్రూపులకు సీఎం పంపిణీ చేశారు. 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను కూడా సీఎం జగన్ పంపిణీ చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ యంత్రసేవా పథకం మెగా మేళా-2లో భాగంగా.. రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్ల రాష్ట్ర స్ధాయి పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.
వరుసగా ఐదో సారి వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున సహాయాన్ని విడుదల చేశారు. 52.30 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. మొత్తం రూ.3వేల 900 కోట్లకు పైగా నిధులు జమ చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన దానికంటే ఎక్కువగా రైతు భరోసా ఇస్తున్నామని కర్నూలు జిల్లాలో పత్తికొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అన్నారు.
నేటి నుంచి ఏపీలో వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీని ప్రభుత్వం చేపట్టనుంది. 63.14 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1739.75 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం పింఛన్ల రూపంలో పంపిణీ చేయనుంది.