ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలక అంశాలకు ఆమోదం లభించింది. జలవనరుల శాఖలో జీవో 62 అమలుపై కేబినెట్‌లో చర్చ జరిగింది. గిరిజన ప్రాంతాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది.. చెత్తపన్ను రద్దు అమలు విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఇక, మహిళలకు ఉచిత సిలిండర్ల పంపిణీ పథకంపై కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ సాగింది.. మరోవైపు.. దేవాలయాల పాలకమండలి సభ్యుల సంఖ్యను 15 నుండి 17 వరకు పెంచాలని నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్.. ఇద్దరు బ్రాహ్మణులు పాలకమండలిలో ఉండాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది..
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం.. కొత్త లిక్కర్ పాలసీకి ఆమోదం తెలిపింది.. ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. 100లోపు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవాలని మంత్రివర్గం నిర్ణయించింది.. రూ.99కే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై కీలక చర్చలు జరిగాయి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంత్రులంతా హాజరైన కేబినెట్ సమావేశంలో.. పలు అంశాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది.. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది..
సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది.. 38 అంశాల అజెండాతో సాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది..
సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అనంతరం కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్.. పెన్షన్ దారులకు ఆనందాన్నిచ్చేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందన్న ఆయన.. రూ. 2,500 నుంచి రూ. రూ. 2,750కు పెంచేందుకు నిర్ణయించాం.. దీని వల్ల ప్రభుత్వానికి అదనంగా రూ. 134 కోట్లు ఖర్చు అవుతుందని.. అయినే.. సంక్షేమ పథకాల అమల్లో వెనక్కి తగ్గేది లేదన్నారు.. నిజం ఎలా ఉంటుందంటే.. జగన్‌లా ఉంటుందని…
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నాడు మరోసారి కుదేలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా అమ్మకాల ఒత్తిడిని తట్టుకోలేక సెన్సెక్స్ భారీ నష్టాలను చవి చూసింది. ఉదయం పూట నష్టాలతోనే మొదలైన మార్కెట్లు చివరి వరకు అదే ధోరణిని కొనసాగించాయి. దీంతో గురువారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1158 పాయింట్లు దిగజారి 59,984 వద్ద స్థిరపడింది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ కూడా 353 పాయింట్లు నష్టపోయి 17,857 పాయింట్ల వద్ద ముగిసింది. ఈరోజు…
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశమైంది.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది కేబినెట్.. ఇక, కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని నాని.. తీసుకున్న నిర్ణయాలను విరించారు.. పేద, మధ్య తరగతి వర్గాల కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం అన్నారు.. రైతులకు ఉదయం 9 గంటల పాటు ఉచిత విద్యుత్ కోసం 10 వేల మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్ రూ.2.49కు 30 ఏళ్ల పాటు ఇచ్చేందుకు కేంద్ర…