AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Key Decisions: సచివాలయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలుకు ఆమోద ముద్ర వేసింది కేబినెట్.. దీనికి సంబంధించిన బిల్లుపైచర్చించి ఆమోదం తెలిపింది.. రేపు అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.. ఇక, మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఉద్యోగి రిటైర్ అయిన సమయానికి ఇంటి స్థలం లేని వారికి కచ్చితంగా ఇంటిస్థలం ఉండాలని స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలన్న ఆయన.. రిటైర్ అయిన తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలు కూడా ఆరోగ్య శ్రీ కింద అందరూ కవర్ అయ్యేలా చూడాలని ఆదేశించారు. రిటైర్ అయిన పిల్లల చదువులు కూడా ఫీజు రియింబర్స్ మెంట్ కింద కూడా ప్రయోజనాలు అందేలా చూడాలని.. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు సీఎం వైఎస్ జగన్.
Read Also: Mangli: మరో మాసీ నెంబర్ తో వచ్చేసిన మంగ్లీ.. యాడున్నాడో అంటూ!
Also Read
ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో 49 అంశాల పై చర్చించారు.. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పథకం తీసుకురానున్నారు.. సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుంది.. UPSC లో ప్రిలిమ్స్, మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు 50 వేల నుంచి లక్ష ఆర్ధిక సాయం.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లు, ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు ముసాయిదా బిల్లు, ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లు, జగనన్న ఆరోగ్య సురక్షపై కేబినెట్ చర్చించింది.. కురుపం ఇంజనీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదన, ఆంధ్రప్రదేశ్ ఆధార్ సవరణ బిల్లు, పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణం, అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు పీఓటీ చట్ట సవరణ.. భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లు ఇలా పలు అంశాలపై కీలకంగా చర్చించింది ఏపీ కేబినెట్.
తాజావార్తలు
-
Israeli-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి
-
Free Coaching: ఫీజు సున్నా.. ఉద్యోగం పక్కా! నిరుద్యోగులకు APCRDA శుభవార్త..
-
Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
-
Earbuds: 60 గంటల బ్యాటరీ లైఫ్.. బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ.. కేవలం రూ.1299లకే..
-
Nandana: 10 గంటలు పోలీసుల కస్టడీలో ఉన్నా పెదవి విప్పని నందన?
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!