Somu Veerraju: కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరిని కలిసిన సోము వీర్రాజు.. ఏపీ సర్కారుపై ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju: కేంద్ర నగర వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరిని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీలో కలిశారు. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి నివాసంలో ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డితో కలిసి మంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణంలో జరుగుతున్న పొరపాట్లు, అలసత్వంపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర పార్టీ నుంచి వినతి పత్రం అందించారు. త్వరలో రాష్ట్రంలో పర్యటించాలని కేంద్రమంత్రిని కోరగా.. వస్తామని హామీ ఇచ్చినట్లు సోము వీర్రాజు వెల్లడించారు.
దేశంలో ఇతర రాష్ట్రాల కంటే అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ ఇళ్లను కేటాయించారని.. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రానికి కేటాయిస్తే పనులు ఎందుకు నత్తనడకన నడుస్తున్నాయని సోము వీర్రాజు ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశామన్నారు. కేంద్ర మంత్రి వెంటనే సమీక్ష నిర్వహించాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి వ్యక్తిగతంగా పరిశీలన చేయాలని కోరామని ఈ సందర్భంగా సోము వీర్రాజు వెల్లడించారు. కేంద్ర సహకారంతో నిర్మాణం జరుగుతున్న ఇళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే బోర్డు లేదని.. వైసీపీ కలర్లు వేస్తున్నారని, వైసీపీ ఇళ్లుగా మార్చేశారని ఆయన ఆరోపించారు. గైడ్‌లైన్స్‌లో లేని విషయాలను అభ్యంతరకరంగా అమలు చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read
Read Also: Kishan Reddy : కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రికి కిషన్ రెడ్డి లేఖ
జగనన్న కాలనీని మోడీ అన్న ఇల్లు అని పేరు పెట్టాలన్నారు. వైసీపీ కలర్ వాడొద్దని ఆయన సూచించారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇల్లు సైతం ఇప్పటికీ ప్రజలకు ఇవ్వలేదన్నారు. రేపు కేంద్ర జలశక్తి మంత్రిని కలుస్తామని సోము వీర్రాజు తెలిపారు. మంత్రి పోలవరంపై గతంలో సమీక్ష చేశారని.. ప్రస్తుత పరిస్థితి ఏంటని, వాస్తవాలు తెలుసుకుంటామన్నారు. పంచాయతీ శాఖా మంత్రిని కూడా కలుస్తామన్నారు. పంచాయతీ సర్పంచుల నిధుల విషయంలో ఏపీలో గందరగోళం నెలకొందన్నారు. సర్పంచులకు నిధులు నేరుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్పంచుల ఖాతాల్లో పడ్డ నిధులు, రాష్ట్ర ప్రభుత్వం తమ ఖాతాలోకి మళ్ళిస్తోందని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం రాష్టం చాలా నిధులు అడుగుతోందని.. వాస్తవాలు తెలుసుకోవాలని ఏపీ బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు