Andhra Pradesh Assembly: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో ఆందోళన పర్వం కొనసాగుతూనే ఉంది.. ఇవాళ సభ ప్రారంభం అయిన వెంటనే ఆందోళనకు దిగారు తెలుగుదేశం పార్టీ సభ్యులు.. స్పీకర్ పోడియాన్ని చుట్టు ముట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు.. తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు.. సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనల వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.. కాగా, సీఎం జగన్ ఢిల్లీ పర్యటనల వివరాలు సభ ముందు ఉంచాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం…
AP Budget: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిన్న గురువారం కొత్త పొద్దు పొడిచింది. ఆ రాష్ట్ర అసెంబ్లీకి కొత్త పద్దు సమర్పించారు. 2023-24 సంవత్సరానికి 2 లక్షల 79 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. కీలక రంగాల్లో ఒకటైన సంక్షేమానికి అత్యధికంగా 51 వేల 345 కోట్ల రూపాయలు కేటాయించారు. అనంతరం.. వ్యవసాయానికి 41 వేల 436 కోట్లు విడుదల చేయనున్నారు. ఆ తర్వాత.. విద్యకు 32 వేల 198 కోట్ల రూపాయిలు…
ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీ లో 2023-24 బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. శాసనమండలి లో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష ఆర్ధిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాటల దాడిని ఉద్ధృతం చేశారు వైసీపీ నేతలు. పవన్ మచిలీపట్నం సభపై కౌంటర్లు ఇస్తున్నారు. మచిలీపట్నం సభలో మాట్లాడిన పవన్ వచ్చే ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన బలిపశువు కాబోదని, తాము ప్రయోగాలు చేయబోమని స్పష్టంచేశారు.
Vizag Capital: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. జులై నుంచి విశాఖకు వెళ్తున్నామని మంత్రులకు చెప్పారు సీఎం జగన్.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఆమోదించాల్సిన బిల్లుల కోసం కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. అధికారికంగా కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రులతో మాట్లాడిన సీఎం.. విశాఖ నుంచి పరిపాలన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట.. ఉగాది నుంచి సీఎం జగన్ .. విశాఖకు వెళ్తారని అక్కడి…
ఏపీ అసెంబ్లీలో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు.రెండోరోజునుంచే ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలతో రెడీ అయ్యారు. వైసీపీ దూరంగా ఉంటున్న నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీలో నిరసనకు దిగారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. నిన్న గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి ఇవాళ ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి దానిపై చర్చిస్తున్నారు. రేపు ఏపీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెడతారు.