ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నాయి. జీవో 1ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఛలో అసెంబ్లీకి టీడీపీ, వామపక్ష పార్టీలతో పాటు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ నేతలను ముందస్తు, హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఛలో అసెంబ్లీకి అనుమతి లేదని, పాల్గొన్న వారిపై చర్యలు ఉంటాయన్న పోలీసులు హెచ్చరిస్తున్నారు. విజయవాడ, గుంటూరులో టీడీపీ, వామపక్షానేతలతో పాటు విద్యార్థి సంఘాల నేతలను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే అజ్ఞాతంలోకి పలువురు వామపక్ష, టీడీపీ నాయకులు వెళ్లారు. అసెంబ్లీకి వెళ్లే ప్రధాన ప్రాంతాల్లో, కూడళ్ళలో భారీగా బలగాలను పోలీసులు మోహరించారు. ప్రధాన మార్గాలతో పాటు, అనుమానాస్పద వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
Also Read : Lord Shiva Sahasranama Stotram: సోమవారం నాడు ఈ స్తోత్రం వింటే మానసిక ప్రశాంతత పొందుతారు
మరోవైపు డిమాండ్ల సాధనకై చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలివెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలను చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. కాకినాడ జిలా పిఠాపురం రైల్వేస్టేషన్ నుండి విజయవాడ చలో అసెంబ్లీ కి తరలివెళ్తున్న 150మంది అంగన్వాడీ కార్యకర్తలను చలో అసెంబ్లీకి తరలి వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారు.. అనంతరం వారిని పిఠాపురం రైల్వే స్టేషన్ లో నుండి పోలీస్ స్టేషన్ కు తరలించారు… తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీ ముట్టడికి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పిఠాపురం పట్టణంతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 150 మంది అంగన్వాడీ వర్కర్లు, కార్యకర్తలు ఆదివారం రాత్రి పిఠాపురం రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న కాకినాడ డీఎస్పీ పడాల మురళీకృష్ణారెడ్డి పిఠాపురం సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడ భారీగా మోహరించి.. వారందరినీ రైలు ఎక్కకుండా అడ్డుకొని రైల్వే స్టేషన్ లోనే నిర్భందించారు. దీంతో అంగన్వాడి వర్కర్ యూనియన్ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
Also Read : Sri Shiva Stotra Parayanam: నేడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే శివుడు ప్రసన్నం అవుతాడు
ఇంకోవైపు చలో విజయవాడకు పిలుపునిచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తలును పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీలు పిలుపునిచ్చారు. విజయవాడకు బయలుదేరిన వారిని జిల్లాల్లోనే పోలీసులు అడ్డుకుంటున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద అంగన్‌వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తలను చలో అసెంబ్లీకి తరలి వెళ్ళకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలివెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు అనుమతి లేదంటూ పోలీసులు హెచ్చరించారు.