ఇప్పుడు మూడు రోజులు ముందుగానే.. అంటే, ఈ నెల 27తో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.. ఇక, ఈ నెల 22వ తేదీన అసెంబ్లీలో వ్యవసాయం, 23న శాంతిభద్రతలు, 24న ప్రభుత్వ బిజినెస్‌పై చర్చ సాగనుండగా.. 25న ఆరోగ్యంపై స్వల్పకాలిక చర్చ ఉంటుంది.. మరోవైపు, 26న లాజిస్టిక్స్, ఉపాధి కల్పన, పరిశ్రమలపై చర్చ జరుగుతుంది.. 27న సూపర్ సిక్స్ అమలుపై స్వల్పకాలిక చర్చ ఉంటుంది.. చివరి రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముగింపు సందేశం ఇవ్వనున్నారు..
Speaker Ayanna Patrudu: నా బాధను మనసు విప్పి చెబుతున్నాను.. కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయినా జీతం తీసుకుంటున్నారు అని శాసన సభా స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు.
‘ఫీజు పోరు’ అని ముందుగా పేరు పెట్టి.. ఆ తర్వాత ‘యువత పోరు’ అని పేరు మార్చటంపై జనాలు నవ్వుకుంటున్నారని మంత్రి నారా లోకేష్ వైసీపీపై సెటైర్లు వేశారు. అసలు వైసీపీ వాళ్లకు దేని మీద పోరాడుతున్నారో కనీసం క్లారిటీ ఉండాలి కదా? అని ఎద్దేవా చేశారు. స్వల్పకాలిక ప్రశ్నోత్తరాల సమయంలో అన్ని విషయాలు మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై మాట్లాడేందుకు తాము సిద్ధం అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.…
AP Cabinet: రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 2025-26వ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను చంద్రబాబు సర్కార్ ప్రవేశ పెట్టనుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది.
‘కేసీఆర్’ ఇంటర్నెట్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత! మాజీ సీఎం కేసీఆర్ వీరాభిమాని, దివ్యాంగుడైన చిర్రా సతీశ్ జిరాక్స్ సెంటర్‌ను ఎమ్మెల్సీ కవిత సోమవారం ప్రారంభించారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగుడైన సతీశ్‌కు ఆర్థికంగా చేయూతనందించిన కవిత.. నేడు ‘కేసీఆర్’ ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్‌ను ఆరంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ రవీందర్ రావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, మాజీ ఎంపీ మలోత్ కవిత పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా…
ప్రతిపక్షం అసెంబ్లీకి రాకపోయినా సమావేశాలను సీరియస్ గా తీసుకోవాలని సీఎం చంద్రబాబు మంత్రులు ఎమ్మెల్యే లకు చెబుతున్నారు.... ప్రతిపక్షం లేదని లైట్ తీసుకోవద్దన్నారు సీఎం...అధికార ప్రతిపక్ష పాత్ర రెండూ కూటమి నుంచే ఉండాలని ఆదేశాలు వెళ్లాయి
మహిళల భద్రత విషయంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం. బస్ మార్షల్స్ నియమించాలని ఎల్జీకి సిఫార్స్ రాజధాని డిటిసి (ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్) బస్సుల భద్రత కోసం మోహరించిన బస్ మార్షల్స్‌ను తక్షణమే పునరుద్ధరించాలని ఢిల్లీ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనాకు సిఫార్సు చేసింది. ఈ నిర్ణయాన్ని నొక్కి చెబుతూ.. బస్ మార్షల్స్ నియామకం ప్రయాణీకులకు, ముఖ్యంగా మహిళా ప్రయాణీకులకు భద్రతా వాతావరణాన్ని అందించడంలో సహాయపడిందని మంత్రిమండలి పేర్కొంది. బస్సుల లోపల మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని…
సోమవారం ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రూ.2.94 లక్షల కోట్లతో మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా.. ఇవాళఉదయం 10 గంటలకు బడ్జెట్‌పై ఎమ్మెల్యే లకు అవగాహనా కార్యక్రమం నిర్వహించనున్నారు.
నేటి నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనునుంది. ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుంది. 11 గంటలకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. శాసనమండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.