విశాఖ రైల్వే జోన్‌కు స్థలం కేటాయించారు.. త్వరలోనే పనులు షురూ.. విశాఖ రైల్వే జోన్ స్థలం కేటాయించారని, త్వరలోనే జోన్ పనులు ప్రారంభం చేస్తామని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. జంగారెడ్డిగూడెం పట్టణ బీజేపీ సమావేశంలో కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడారు. భద్రాచలం కొవ్వూరు రైల్వే లైను ఇప్పటివరకు సత్తుపల్లి వరకు పూర్తి అయ్యింది మిగతాది అతి త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. బీపీసీల్ కంపెనీ 70 కోట్ల రూపాయల ప్రాజెక్టును వేరే రాష్ట్రంలో పెట్టాలనుకున్న…
రేపటి నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రేపు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రేపు ఉదయం 9 గంటలకు బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనునుంది. ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుంది
అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. ప్రతి 3 రోజులకు ఒకసారి మీడియా ద్వారా చంద్రబాబును ప్రశ్నిస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష కూటమి ఉంటాయని.. మేం కాకుండా ప్రతిపక్షం లేనపుడు మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలని జగన్ కోరారు. ప్రతిపక్షాన్ని గుర్తిస్తే ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా నాయకుడు ఉంటారు కదా అంటూ వ్యాఖ్యానించారు.
ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఏపీ శాసన సభ సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. శాసన సభ , శాసన మండలి సమావేశాల నోటిఫికేషన్‌ను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ జారీ చేశారు.
AP Assembly Sessions: మూడో రోజు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. విశాఖలో కాలుష్య నియంత్రణకు తీసుకున్న చర్యలపై ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్ ప్రశ్న వేయగా.. దానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సమాధానం ఇస్తూ.. ధూళి కణాల పొల్యూషన్ ఎక్కువగా ఉందన్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ ముగియనుంది. ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ ప్రాధాన్యతలను గవర్నర్ వివరించనున్నారు.