AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలపై కసరత్తు వేగవంతమైంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలోపే ప్రభుత్వానికి నివేదికని ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది. ఆ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకొనుంది. అయితే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. రెండు మూడు జిల్లాల ఏర్పాటుతో పాటు కొన్ని చోట్ల హద్దులు మార్చే అవకాశం ఉందని సమాచారం. వైస్సార్సీపీ హాయాంలో పరిపాలన సౌలభ్యం కోసం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. అయితే, ఇందులోని గందరగోళం ఉందని మార్పులు అవసరమని…
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అసెంబ్లీకి వస్తారా..? రారా? క్లారిటీ ఇవ్వండి.. మీ మూలంగా ప్రశ్నలు మురిగిపోతున్నాయని మండిపడ్డారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి.. ముందు ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని నిలదీశారు.. ప్రజాస్వామ్య దేవాలయంకు ఆయన ఇచ్చే గౌరవం ఇదేనా? ఆ సభ్యులు ఇచ్చే గౌరవం ఇంతేనా? అంటూ ఫైర్ అయ్యారు..
వచ్చే నెల రెండో వారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉండనుంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాల గురించి ప్రత్యేక చర్చలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో బనకచర్ల…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈసారి కూడా ప్రతిపక్షం లేకుండానే జరిగాయి. మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరవడం మినహా... ఆ తర్వాత వైసీపీ నుంచి హాజరు లేదు. అదే సమయంలో... కూటమి ఎమ్మెల్యేలు కొంతమంది కాస్త ముందుకు వెళ్ళి.... వాళ్ళు లేకపోతేనేం.... మేమున్నాంగా.... అంటూ, ఏకంగా ప్రతిపక్ష పాత్ర పోషించేశారు. ధూళిపాళ్ళ నరేంద్ర, కూన రవికుమార్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి..
CM Chandrababu: ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఆ మాట త్వరలో నిలబెట్టుకుంటున్నామన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే సమస్య పరిష్కారం అవుతుందని గతంలోనే చెప్పా.. జిల్లాల వారీగా కేటగీరి విభజన చేయాల్సి ఉంది.
అర్జున్ S/o వైజయంతి థియేట్రికల్ బిజినెస్ అదిరింది నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఏడాది కాలంగా షూటింగ్ దశలోనే ఉన్నఈ సినిమా ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. మునుపెన్నడూ చూడని…
ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సునీత విలియమ్స్ కు అభినందనలు.. శుభాకాంక్షలు చెప్పింది శాసనసభ... సునీత విలియన్స్ జీవితం స్ఫూర్తి దాయకం అన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. తర్వాత అసెంబ్లీ లో క్వశ్చన్ అవర్ ప్రారంభం అయింది.. సంచార పశువైద్యశాలలు... విశాఖ స్టీల్ ప్లాంట్ భూములలో. రైతులకు నష్టపరిహారం.. ఎమర్జెన్సీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యం..ఈ అంశలకు సంబంధించి చర్చ జరిగింది..
మనమిత్ర యాప్ ప్రపంచంలోనే మెరుగ్గా తీర్చిదిద్దుతాం అన్నారు మంత్రి నారా లోకేష్.. జూన్ 30వ తేదీ నాటికి వాట్సాప్ ద్వారా 500 రకాల పౌరసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. వందరోజుల్లో ఏఐ ఆధారిత వాయిస్ ఎనేబుల్ సేవలు తెస్తాం అన్నారు.. కేవలం పది సెకన్లలోనే పౌరులకు సేవలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అన్నారు లోకేష్.. అలాగే పౌరులకు సంబంధించిన సమాచారం కూడా పూర్తి భద్రంగా ఉంటుందన్నారు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరో కీలక చట్ట సవరణ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది.. ఏపీ భూ హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.. అప్పిలేట్ అథారిటీని జిల్లా రెవెన్యూ అధికారుల నుంచి ఆర్డీవోలకు మారుస్తూ చట్టసవరణ చేశారు... చట్టసవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్..
ఆర్కియాలజీ లైబ్రరీల గురించి అసెంబ్లీలో ప్రశ్నోత్నరాల సమాయంలో చర్చ సాగింది.. రాష్ట్ర విభజన జరిగినప్పుడు.. ఆస్తి, అప్పుల విభజనలో ఏపీకి ఆర్కియాలజీ లైబ్రరీకి సంబంధించి సాంస్కృతిక సంపద పూర్తిగా రాలేదని లేవనెత్తారు జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్.. ప్రభుత్వం వెంటనే ఆర్కియాలజీ శాఖ లైబ్రరీపై దృష్టి పెట్టాలని కోరారు.. ఇక, మండలి బుద్ధ ప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇస్తూ.. రాష్ట్ర విభజన తర్వాత 50 శాతం ప్రాచీన పత్రాలు రాష్ట్రానికి…