గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైసీపీ... 11మంది ఎమ్మెల్యేలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ఆ పార్టీకి టెక్నికల్‌గా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయితే... సభలో నాలుగు పార్టీలు ఉండగా... మూడు కూటమి మిత్రపక్షాలే. ఇక మిగిలి ఉంది మేమే కాబట్టి... మాకు ఆ హోదా కావాలన్నది వైసీపీ డిమాండ్.
"అసెంబ్లీలో ప్రస్తావించిన సమస్యను విని తక్షణమే స్పందించి పరిష్కరించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రివర్యులు పవన్ కల్యాణ్ గారికి నా ధన్యవాదాలు. ప్రజా సమస్యలపై ఇంత వేగంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనం.." అంటూ ట్వీట్.. ఇక, పవన్ కల్యాణ్ గారికి నా ధన్యవాదాలు. ప్రజా సమస్యలపై ఇంత వేగంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనం.." అంటూ మరో ట్వీట్ చేశారు బోండా ఉమామహేశ్వరరావు.
అసెంబ్లీలో బోండా ఉమ క్వశ్చన్ ఓవర్ లో చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు ...శాఖా పరంగా ఎంక్వైరీ కికూడా ఆదేశించారు ...అసలు ఏ ఉద్దేశంతో బోండా ఉమా ఈ వ్యాఖ్యలు చేయవలసి వచ్చిందో పూర్తిస్థాయి విచారణ చేయమన్నారు...పవన్.. సీఎం దృష్టికి కూడా ఈ ఎపిసోడ్ తీసుకెళ్లాలని పవన్ సూచించారు. నెక్స్ట్ ఏం జరగబోతోంది..... విచారణ తర్వాత పరిస్థితి ఏ రకంగా ఉండబోతోంది..ఇదే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్. గా మారింది...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణలో మెజారిటీ ప్రాజెక్టులు నేను ప్రారంభించినవే అని వెల్లడించారు. తొలిసారి అనంతపురంలో రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వడం ప్రారంభించామని అన్నారు. ఉపాధి లేక పాలమూరు జిల్లా నుంచి వలసలు వెళ్లేవారు అని గుర్తు చేశారు. ఫ్లోరైడ్ బాధిత నల్గొండ జిల్లాకు శ్రీశైలం జలాలు అందించామని తెలిపారు. నల్గొండకు లిఫ్ట్ ద్వారా శ్రీశైలం ఎడమ కాలువ నీళ్లిచ్చామన్నారు.…
ఇప్పుడు మూడు రోజులు ముందుగానే.. అంటే, ఈ నెల 27తో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.. ఇక, ఈ నెల 22వ తేదీన అసెంబ్లీలో వ్యవసాయం, 23న శాంతిభద్రతలు, 24న ప్రభుత్వ బిజినెస్‌పై చర్చ సాగనుండగా.. 25న ఆరోగ్యంపై స్వల్పకాలిక చర్చ ఉంటుంది.. మరోవైపు, 26న లాజిస్టిక్స్, ఉపాధి కల్పన, పరిశ్రమలపై చర్చ జరుగుతుంది.. 27న సూపర్ సిక్స్ అమలుపై స్వల్పకాలిక చర్చ ఉంటుంది.. చివరి రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముగింపు సందేశం ఇవ్వనున్నారు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 1.45కి ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. గురువారం నుంచి ఏపీ శాసన సభ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులకు ఆమోదం తెలపనుంది కేబినెట్.. మొత్తం 15 అంశాలు ఎజెండాగా ఈ రోజు కేబినెట్ భేటీ జరగనుంది..
రాష్ట్ర ప్రజలకు జీఎస్టీ అర్ధం కావాలంటూ.. అందరికీ అర్థమయ్యే రీతిలో అసెంబ్లీలో ప్రసంగించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జీఎస్టీ ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. నా రాజకీయ జీవితంలో కమర్షియల్ టాక్స్ చూశాను.. తర్వాత వ్యాట్ వచ్చింది.. వేరే రాష్ట్రంలో నుంచి వస్తువులు వస్తే ఎంట్రీ టాక్స్ ఉండేది.. టాక్స్ అనేది కాంప్లికేటెడ్ అయిపోయిందన్నారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు జీఎస్టీ ప్రవేశ పెడదాం అనుకున్నారు. ఇప్పుడు మోడీ ప్రధానిగా జీఎస్టీ అమలు చేస్తున్నారన్నారు.. అయితే,…
ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరుఅవుతారా? లేదా? అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. ఈ నేపథ్యంలో.. ఎల్లుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది..
ఉద్యోగులు డ్యూటీకి వెళ్లకపోతే జీతం కట్ చేస్తారు.. మరి, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలి..? అని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు..