వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో మూడు రాజధానులే మా విధానం అని స్పష్టం చేసింది.. అమరావతిని శాసన రాజధానిని చేసి.. విశాఖను పరిపాలన రాజధానిగా.. కర్నూలును న్యాయ రాజధానిగా పేర్కొన్నారు.. ఆ దిశగా గత ప్రభుత్వం అడుగులు వేసింది.. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టింది.. ఈ నేపథ్యంలో వైసీపీ స్టాండ్ ఏంటి? నే చర్చ సాగుతుండగా.. మూడు రాజధానులపై మా స్టాండ్ ఏంటో త్వరలో చెప్తాం అన్నారు…
ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలుచేశారు మంత్రి రాంబాబు.. ప్రస్తుతానికి ఏపీకి రాజధాని అమరావతే అని స్పష్టం చేసిన ఆయన.. కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు.
AP 3 Capitals: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం.. అసలు రాజధానులు ఎక్కడ పెట్టాలనేది రాష్ట్రాల ఇష్టం అని తెలిపారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగించిన విజయసాయి రెడ్డి.. ప్రత్యేక హోదా, మూడు రాజధానులు, జనాభా ప్రాతిపదికపై బీసీలకు రిజర్వేషన్లు, చట్ట సభలు, న్యాయ వ్యవస్థలో మహిళలకు రిజర్వేషన్లు ,విశాఖ మెట్రో అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు.. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే ఏపీలో మూడు…
Botsa Satyanarayana: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న విశాఖలో వైసీపీ ఆధ్వర్యంలో ప్రజా గర్జన జరగనుంది. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో రేపు జరగబోయే గర్జన అందరి కళ్లు తెరిపిస్తుందని వ్యాఖ్యానించారు. విశాఖను రాజధానిగా వ్యతిరేకించే వాళ్ల కళ్లు తెరిపేలా తమ గర్జన ఉండబోతుందన్నారు. గర్జన తర్వాత ఏ నిమిషంలో విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం అవ్వాలన్నదే తమ కోరిక అని మంత్రి బొత్స తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణే కాదు…
ఏపీలో మూడురాజధానుల్లో భాగంగా కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర లోకాయుక్త కార్యాలయాన్ని కర్నూలులో ఇంతకుముందే ఏర్పాటు చేశారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహం మూడో నెంబరు గదిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి ప్రారంభించారు. ఇంతవరకు హైదరాబాద్‌లో కొనసాగిన లోకాయుక్త, ఉపలోకాయుక్త కార్యకలాపాలను ఇకపై కర్నూలు నుంచి నిర్వహిస్తారు. తాజాగా కర్నూలు సంతోష్ నగర్ లో లోకాయుక్త నూతన కార్యాలయాన్ని జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ప్రారంభించారు.…
ఏపీలో ఇప్పుడు మూడు రాజధానుల అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. మూడు రాజధానులపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి ఎంత నష్టపోయామో అందరికీ తెలుసు. తమ ప్రభుత్వం అమరావతిలోనే ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా ఉండేందుకే మూడు రాజధానులు ఆలోచన చేస్తోందన్నారు. ఈ మూడురాజధానులకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న దశలో కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయి. అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు డిప్యూటీ సీఎం…
ధర్మం, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని, రాజధాని అమరావతి విషయంలో అదే జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దుర్మార్గులు పెట్రేగిపోవటం తాత్కాలికమేనని, ఎస్సీలు, ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకుంటే జగన్‌కి కులం అడ్డొచ్చిందని ఆయన విమర్శించారు. శ్రీకాకుళం-అనంతపురానికి మధ్యలో ఉన్న అమరావతిని రాజధాని గా ఎంపిక చేస్తే జగన్ మద్దతు తెలిపారని, అమరావతితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధి కి శ్రీకారం చుట్టామన్నారు. ఆరోజు అడ్డం రాని కుల-మతాలు…