మూడు రాజధానుల విషయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తాజాగా చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు మంత్రి అచ్చెన్నాయుడు.. మూడు రాజధానుల విషయంలో వైఎస్ఆర్సీపీ యూ టర్న్ తీసుకుందన్న ఆయన.. యూ టర్న్ తీసుకుందంటేనే వాళ్ల తలాతోకలేని విధానాలకు నిదర్శనమని దుయ్యబట్టారు..
ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించిన 3 రాజధానుల బిల్లు గత అసెంబ్లీ సమావేశాలలో రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై సీఎం జగన్ మాట్లాడుతూ.. 3 రాజధానుల నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోలేదని, కొన్ని సవరణలతో మళ్లీ బిల్లును ప్రవేశపెడుతామని అప్పుడే చెప్పారు. దీంతో 3 రాజధానుల బిల్లు రద్దు చేస్తారనుకున్న వారితో మళ్లీ ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మళ్లీ 3 రాజధానుల వచ్చే బడ్జెట్ సమావేశాల్లో…
ఏపీలో సంచలన సృష్టించిన 3 రాజధానుల అంశం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో 3 రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా త్వరలోనే కొన్ని మార్పులతో మరోసారి బిల్లును తీసుకువస్తామని వ్యాఖ్యానించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇది ఇంటర్వెల్ మాత్రమే ఇంకా 3 రాజధానుల సినిమా అయిపోలేదు అన్నారు. అయితే తాజాగా తాటికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా 3 రాజధానుల అంశంపై స్పందించారు. సీఎం జగన్ తగ్గేదేలేదని..…
3 రాజధానుల అంశం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో మూడు రాజధానులు చేస్తామంటూ జగన్ సర్కార్ ప్రకటించడంతో పాటు అసెంబ్లీలో చట్టం చేసింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలవడంతో హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరుపున హజరైన అడ్వకేట్ జనరల్ 3 రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటునట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయ పరిణామాల్లో మార్పు చోటు చేసుకుంది. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి..…