ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని మల్కన్‌గిరి జిల్లా పోలీసులు కీలకమైన మావోయిస్టులను అరెస్టు చేశారు. మావోయిస్టు పార్టీ కంగేరి ఘాటి ఏరియా కమిటీ సభ్యుడు కేసా కవాసి, ఏవోవీ మిలటరీ ప్లాటును కమిటీ సభ్యుడు, ఏరియా కమిటీ సభ్యుడు రాకేష్ సాను కుంజమ్ లను అరెస్ట్ చేశారు..
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం జర్న పంచాయితీ గ్రామ సచివాలయంలో మహిళా పోలీస్ నిర్మల దిశా యాప్ డౌన్లోడ్ చేసేందుకు గ్రామస్తులు వద్దకు వెళ్ళారు. గ్రామంలో ఉన్నవారి మొబైల్ కి దిశ యాప్ డౌన్లోడ్ చేద్దామని ప్రయత్నించారు. కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఒడిశా సెల్ సిగ్నల్స్ వస్తున్నాయి. ఒడిశా సెల్ సిగ్నల్స్ తో యాప్ డౌన్లోడ్ అవ్వకపోతుండడంతో ఆమె తెలివిగా ఆలోచించింది. గ్రామానికి చాలా దూరంగా ఆంధ్రప్రదేశ్ సెల్ సిగ్నల్ ఎక్కడ వస్తుందో పరిశీలించి…
భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా ఏపీ పోలీసులు భారీ స్థాయిలో గంజాయిని దహనం చేయనున్నారు. ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ఏపీ పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా రాష్ట్రంలోని వివిధ శాఖల సమన్వయంతో పాటు సరిహద్దు రాష్ట్రాల సహాయ సహకారాలతో విస్తృతంగా గంజాయి తోటలను ధ్వంసం చేసి.. గంజాయి సాగుపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. అనేక దశాబ్దాలుగా ఏవోబీతో పాటు గిరిజన గ్రామాలలో కొనసాగుతున్న గంజాయి సాగుపై గతంలో…
ఆపరేషన్ పరివర్తన్ కింద 800 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేసినట్టు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మ ఆట్లాడారు. గంజాయి సాగును అరికట్టేందుకు ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటున్నామన్నారు. ఈ ఆపరేషన్లో 80 టీమ్‌లు పాల్గొన్నాయని, గంజాయి సాగును ధ్వంసం చేయకుండా గిరిజనులు ప్రతిఘటిస్తున్న సంఘటనలు తక్కవగా చోటుచేసుకుంటున్నాయని ఆయన తెలి పారు. గంజాయి సాగును ధ్వంసం చేయడానికి చాలా మంది గిరిజ నులే స్వచ్ఛంధంగా…
మావోయిస్టుల కోసం నిరంతరం పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది.. కూంబింగ్ జరుగుతోన్న కొన్ని సందర్భాల్లో మావోయిస్టులు ఎదురుపడడం.. కాల్పులు జరపడం.. అటు మావోయిస్టులు, ఇటు పోలీసులు మృతిచెందిన ఘటనలు ఎన్నో.. చాలా సార్లు మావోయిస్టు కీలక నేతలు తప్పించుకున్న సందర్భాలున్నాయి… అయితే, తాజాగా మావోయిస్టు అగ్రనేతలు పోలీసులకు చిక్కినట్టుగా తెలుస్తోంది… ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో ఆరుగురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు స్పెషల్ పార్టీ పోలీసులు… అరెస్ట్ అయినవారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే గన్‌మెన్లు కూడా ఉన్నట్టుగా…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు మావోయిస్టు పార్టీ నేత గణేష్.. వైసీపీ రెండేళ్ల పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. జగన్ ప్రజా వ్యతిరేక, నిరంకుశ విధానాలపై ఐక్య పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.. అవినీతి కేసులు ఉన్న జగన్ కేంద్రానికి తలొగ్గి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని… రెండేళ్ల జగన్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదంటూ తన లేఖలో పేర్కొన్నారు మావోయిస్టు పార్టీ ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) స్పెషల్ జోనల్…