Anveshi Jain: అన్వేషి జైన్.. సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. అమ్మడు అందంతో ఎంతోమందిని కట్టిపడేసింది. ముఖ్యంగా తన ఎద అందాలను ఎరగావేసి.. కుర్రకారు గుండెల్లో.. ఏంజెల్ గా తిష్టవేసుకొని కూర్చోండిపోయింది.
హీరో రవితేజ పక్కన పెట్టేశాడంటూ ప్రచారంలో ఉన్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ఎట్టకేలకు ప్రమోషన్ మొదలైంది. శనివారం ఐటమ్ సాంగ్ సీసాను విడుదల చేశారు. చంద్రబోస్ రాసిన ఈ పాటకు శామ్ సి.ఎస్ సంగీతం అందిచారు. రవితేజ, అన్వేషా జైన్ పై చిత్రీకరించిన ఈ పాటను శ్రేయోఘోషల్ పాడారు. ‘ఒకరికి నే తేనె సీసా… ఒకరికి నేను కల్లు సీసా… ఒకరికి నే రసాల సీసా… అందరికీ అందిస్తాను స్వర్గానికి వీసా… ముట్టుకోకుండా ముద్దు పెట్టేస్తా……
ప్రోమోతో అలరించిన మాస్ మహారాజా రవితేజ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ థర్డ్ సింగల్ ‘నాపేరు సీసా’ పూర్తి పాటని విడుదల చేసింది చిత్ర యూనిట్. అన్వేషి జైన్… సీసా (సీకాకులం సారంగీ) గా పరిచయం అయింది. తన గ్లామర్, మెస్మరైజింగ్ లుక్స్, సిజ్లింగ్ షోతో ప్రేక్షకులని కట్టిపడేసింది. ఈ పాటలో ట్రెడిషనల్ వేర్ లో కనిపించిన రవితేజ సరసన ఉల్లాసంగా ఆడిపాడింది అన్వేషి. థియేటర్ లో మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించేలా వుంది…