Ravi Teja: ‘రామారావు ఆన్ డ్యూటీ’ థర్డ్ సింగిల్ గా సీసా సాంగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రోమోతో అలరించిన మాస్ మహారాజా రవితేజ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ థర్డ్ సింగల్ ‘నాపేరు సీసా’ పూర్తి పాటని విడుదల చేసింది చిత్ర యూనిట్. అన్వేషి జైన్… సీసా (సీకాకులం సారంగీ) గా పరిచయం అయింది. తన గ్లామర్, మెస్మరైజింగ్ లుక్స్, సిజ్లింగ్ షోతో ప్రేక్షకులని కట్టిపడేసింది. ఈ పాటలో ట్రెడిషనల్ వేర్ లో కనిపించిన రవితేజ సరసన ఉల్లాసంగా ఆడిపాడింది అన్వేషి. థియేటర్ లో మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించేలా వుంది ‘నా పేరు సీసా’ సాంగ్. సామ్ సి.ఎస్. మాస్ ఈ పాటని డ్యాన్సింగ్ నెంబర్ గా కంపోజ్ చేయగా ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం సమకూర్చారు. ‘నా పేరు సీసా / ఒకరికినే తేనె సీసా / ఒకరికినే కల్లు సీసా / ఒకరికినే మసాలా సీసా / ఇంకొకరికి రసాల సీసా / అందరికీ అందిస్తాను స్వర్గానికి వీసా’ అంటూ సాగే ఈ పాటలో పదాలన్నీ క్యాచీగా ఉన్నాయి. ‘ఒకరికి నేను నీటి సీసా, ఇంకొకరికి నేను సెలైన్ సీసా’ అని చెప్పడం కొసమెరుపు! పాపులర్ సింగర్ శ్రేయా ఘోషల్, సామ్ సిఎస్ ఫుల్ ఎనర్జీటిక్ గా ఈ పాటని ఆలపించారు.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ ప్రస్తుతం జరుపుకుంటోంది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ కథానాయికలుగా నటిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ ఐఎస్‌సి సినిమాటోగ్రఫీ అందించగా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ”రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాన్ని ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read
https://www.youtube.com/watch?v=ZUPYbt7KKME
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!