మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు అయింది ఓ మహిళ పరిస్థితి. పిల్లి కరిచిందని ఇంజెక్షను తీసుకునేందుకు ఓ మహిళ తండ్రితో కలిసి సామాజిక ఆరోగ్యకేంద్రానికి వెళితే.. తీరా అక్కడ వ్యాక్సిన్ తీసుకోలేదు సరికదా.. వీధికుక్క కరించింది. ఈ విచిత్ర ఘటన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం సమీప విళింజమ్‌లో చోటుచేసుకుంది.