దృవప్రాంతాల్లోని మంచు గత దశాబ్దకాలంగా విపరీతంగా కరుగుతున్నది. ముఖ్యంగా గ్రీన్‌లాండ్, అంటార్కిటికా ప్రాంతాల్లోని మంచు భారీగా కరుగుతున్నది. దీనికి కారణం లేకపోలేదు. కర్భర ఉద్గార వాయువులు భారీ ఎత్తున విడుదల అవుతుండటంతో భూతాపం పెరిగిపోతున్నది. ఫలితంగా మంచు కరుగుతున్నది. గ్రీన్‌లాండ్‌లోని మంచుఫలకాల్లోని అడుగుభాగంలోని మంచు కరుగుతున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే ఈ శతాబ్దం చివరినాటికి గ్రీన్ లాండ్ లోని మంచు మొత్తం కరిగిపోయే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కర్భన వాయువులను నియంత్రించేందుకు అన్ని దేశాలు కట్టుబడి ఉన్నాయి.
Read: అక్కడ అన్ని పనులు రోబోలే చేస్తున్నాయి…
వీలైనంత త్వరగా కర్భన వాయువుల ఉద్గారాలను తగ్గించేలా ఆయా దేశాలు చర్యలు తీసుకోవాల్సి ఉన్నది. గ్రీన్‌లాండ్‌లోని మంచుఫలకాలు కరిగితే సముద్రనీటి మట్టం 7.4 మీటర్ల మేర పెరుగుతాయని, ఇప్పుడున్న ప్రకారమే భూతాపం ఉన్నా ఈ శతాబ్దం చివరి నాటికి సుమారు సముద్రనీటి మట్టాలు 7 నుంచి 13 సెంటీ మీటర్ల మేర పెరుతాయి. సముద్రనీటిమట్టం ఒక్కసెంటీ మీటర్ మేర పెరిగినా దాని వలన ప్రపంచంలోని 60 లక్షల మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూతాపం పెరిగి గ్రీన్‌లాండ్, అంటార్కిటికాలోని మంచు కరిగిపోతే సముద్రం నీటిమట్టం 60 మీటర్లమేర పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కర్బన ఉద్గారాలను జీరో పర్సెంట్‌కు తీసుకొచ్చేలా అన్ని దేశాలు వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.