సాధారణంగా ఎక్కడ చూసినా ఆలయాల్లో ప్రసాదం పేరిట పులిహోర లేదా కేసరి లేదా దద్దోజనం లేదా లడ్డూలు అందిస్తుంటారు. కానీ ఏపీలోని అన్నవరం దేవస్ధానంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడి ఆలయంలో ప్రసాదం కింద భక్తులకు గోధుమ నూకతో చేసిన ప్రసాదం అందిస్తారు. ఈ ప్రసాదం రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి ప్రసాదం మరెక్కడా దొరకదు. తిరుపతి లడ్డూ ఎంత ప్రసిద్ధి చెందిందో.. అన్నవరం ప్రసాదం కూడా అంతే ఆదరణ పొందింది. అన్నవరం ఆలయంలో గోధుమ…
కార్తికమాసం అనగానే తెలుగు రాష్ట్రాల్లో గుర్తుండిపోయే కార్యక్రమం భక్తి టీవీ కోటి దీపోత్సవం. ప్రతి ఏటా కార్తికమాసాన క్రమం తప్పకుండా కోటిదీపోత్సవ వేడుక కనుల పండువగా సాగుతోంది. పరమ పవిత్రమైన కార్తీక మాసాన.. వేలాది మంది భక్తులు ఒక్క చోట చేరి, లక్షలాది దీపాలను వెలిగించే అద్భుత, అద్వితీయ, ఆధ్యాత్మిక ఘట్టం కోటి దీపోత్సవం. పీఠాధిపతులు, గురువులు, ఆధ్యాత్మిక వేత్తల సమక్షంలో లక్షల మంది ఒక్క చోట ఇలా దీపాలు వెలిగించడం ఓ మహాద్భుతమైన సంరంభం. ఈనెల…
కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారం అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణస్వామి దేవస్థానం. అన్నవరంలో వెలపిన సత్యదేవుడిని దర్శించుకోవడంతో ఎంతో అనుభూతి పొందుతారు భక్తులు. కేంద్ర ప్రభుత్వం ప్రేవేశ పెట్టిన ప్రసాద్ పథకంలో ఈసారి అన్నవరం దేవస్థానానికి చోటు దక్కింది. సుమారు 50 కోట్ల రూపాయల నిధులు సత్యదేవుని కొండ అభివృద్ధికి కేటాయించడం జరిగింది. ఇప్పటికే అన్నవరం దేవస్థానం ప్రసాద్ పథకం ద్వారా భక్తుల సౌకర్యాల నిమిత్తం చేపట్టే అభివృద్ధి పనులకు రూపకల్పన చేశారు. అందులో భాగంగా టూరిజం…
అది పవిత్ర పుణ్యక్షేత్రం. ఆలయ అభివృద్ధికి సహకరిస్తూ.. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన పాలకవర్గం.. అధికారుల మధ్య నిత్యం పోరాటాలు.. కుమ్ములాటలు. అక్రమాలకు అంతే లేకుండా పోయింది. కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడుతున్నా సొంత లాభానికే ప్రాధాన్యం ఇస్తున్నారట. వారెవరో.. ఆ ఆలయం ఏదో ఈ స్టోరీలో చూద్దాం. ఆలయానికి ఆదాయం పోతున్నా పట్టదు! తూర్పుగోదావరి జిల్లా అన్నవరం ఆలయంలో.. వ్యాపారులతో కుమ్మక్కైన కొందరు స్వార్థపరులు దేవుడికే శఠగోపం పెడుతున్నారు. కేవలం షాపుల నుంచే 3…
అన్నవరం కొండపై వాళ్లే మూల విరాట్టులు. ఏళ్ల తరబడి కుర్చీలకు అతుక్కుపోయి దేవుడికే శఠగోపం పెడతున్నారు. ఆలయాన్ని అవినీతికి.. రాజకీయ పైరవీలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేసిన ఉద్యోగుల్లో ఇప్పుడు గుబులు మొదలైంది. మరి.. ఇప్పటికైనా చర్యలుంటాయా.. మళ్లీ పైరవీలు చేస్తారా? అన్నవరంలో పాతుకుపోయిన సిబ్బందికి నిద్ర కరువు! అన్నవరం ఆలయంలో అవినీతి అధికారుల మూలాలు కదులుతున్నాయా? దేవాదాయశాఖ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారా? విషయం తెలుసుకున్న అక్రమార్కులు పెద్దస్థాయిలో లాబీయింగ్ మొదలుపెట్టారా? రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకునే…