ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి 132వ ఆవిర్భావ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.. శ్రావణ శుద్ధ పాడ్యమి మొదలు శ్రావణ శుద్ధ విధియ వరకు రెండు రోజులు పాటు ఆలయంలో జయంత్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు… స్వామివారి ఆవిర్భావం వేడుకలు సందర్భంగా ఆలయాన్ని వివిధ పండ్లు పల పుష్పాలతో అత్యంత సుందరంగా అలంకరణ చేసారు.. స్వామివారి ప్రధానాలయంలో అవినీటి మండపంలో స్వామివారిని అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అత్యంత సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై ఆసీన్లు గామించి ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితులు రిత్వికులు విశేష పూజలు నిర్వహించారు.
Annavaram Temple: అన్నవరం సత్యదేవునికి వజ్రకిరీట శోభ
శ్రావణ శుద్ధ విదియ పర్వదినాన స్వామి వారి జయంతి సందర్భంగా ప్రధాన ఆలయంలో తెల్లవారిజామున స్వామి అమ్మవార్లకు మూలవిరాట్లకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.. అదేవిధంగా అనివేటి మండపంలో ప్రత్యేక పూజలు, స్వామివారికి ఆయుష్ హోమంతో పాటు ముందుగా గణపతి పూజ, పుణ్య హవచనం,వేద పారాయణ, జపాలు, మండపారాధన, నవగ్రహ మూలమంత్ర జపాలు, చండీ పారాయణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా పండితులు నిర్వహించారు.
స్వామివారిని వెండి పల్లకిలో ఆసీనులు గావించి బాజా భజంత్రీలు, వేద మంత్రోత్చారణ నడుమ ముమ్మారు ఆలయ ప్రాకార సేవ గావించారు. ఆలయఁలో పూజలు అనంతరం ఆలయ చైర్మన్ పండితులను సత్కరించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కోలాటాల నృత్యాలు ఆకర్షణీయంగా నిలిచాయి. స్వామివారి 132 జయంతి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించారు. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈఓ మూర్తి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది స్వామివారి జయంతి పర్వదినం సందర్భంగా భక్తుడు సుమారు కోటి 50 లక్షల వ్యయంతో చేయించిన వజ్రకిరీటాన్ని స్వామివారికి అలంకరించారు. వజ్రకిరీటం చూడడానికి భక్తుల పోటీపడ్డారు.
Trees Cutting : టెన్నిస్ కోర్టు కోసం వంద చెట్లు నాశనం… బల్దియా తుమ్ నే క్యాకియా?