అది ఏటా వందకోట్ల ఆదాయం వచ్చే ఆలయం. ఎవరు గుర్తించరని అనుకున్నారో.. ఇంతకంటే మంచి తరుణం రాదని భావించారో.. చేతివాటం ప్రదర్శిస్తున్నారట. కమీషన్లు పెంచి ముడుపులు దండుకున్నారట. నిధులు దారి మళ్లించడంలోనూ వారి తర్వాతేనని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దాతలు ఇచ్చే దాంట్లో ఎవరిది చేతివాటం? భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అన్నవరం సత్యనారాయణ స్వామి. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయ పాలకమండలి ఛైర్మన్ రోహిత్. ఈవో త్రినాథ్. దేవుడికి వచ్చే ప్రతి…