త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కూటమికి ఎలాంటి నిబంధనలు లేకుండా తాము బేషరతుగా మద్దతు ఇవ్వనున్నట్లు అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తెలియచేసారు. ఇందుకు సంబంధించి అర్ధరాత్రి వేళ తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించి తిరుచ్చిలో మంగళవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాము బీజేపీ కూటమిలో చేరే విషయమై గడిచిన రెండు, మూడు నెలలుగా చర్చలు జరుగుతున్నాయని టీటీవీ దినకరన్ తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయానికి తమ పార్టీ కార్యకర్తలు అవిశ్రాంతంగా శ్రమిస్తారని దినకరన్ చెప్పుకొచ్చారు.
Read Also: Ram Charan: రామ్ చరణ్ సరసన మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్!
ఇందులో భాగంగా బీజేపీ పార్టీతో పొత్తుకు ఏఏంఏంకే పార్టీ అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన తెలిపారు. తాజాగా టిటివీ దినకరన్ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతో భేటి అయ్యారు. ఇందులో భాగంగా వచ్చే లోక్ సభ ఎన్నికలలో కలసి పోటి చేయడానికి రెండు పార్టీ పరస్పర అంగీకారం తెలిపాయి. ఈ సందర్బంగా చిన్నమ్మ శశికళ సూచనతో బీజేపీ పార్టీతో కలసి నడవడానికి అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఒకవైపు పరిస్థితి ఇలా ఉండగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సేల్వంతో బీజేపీ పార్టీ చర్చలు జరుపుతుంది. దింతో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అర్ధం అవ్వడం లేదు.