Annamalai: కర్ణాటకలో రాజకీయం ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. అధికారంలోకి రావడానికి బీజేపీ, కాంగ్రెస్ కష్టపడుతున్నాయి. ఇదిలా ఉంటే కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దుతు తెలపడం కాంగ్రెస్ కు షాక్ ఇచ్చింది. దీంతో బీజేపీపై, సుదీప్ పై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. తాజాగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఈ విషయంపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ రాహుల్ గాంధీకి మద్దతుపలకాన్ని ఆయన ప్రస్తావిస్తూ గ్రాండ్ ఓల్డ్ పార్టీపై విమర్శలుకు దిగారు.
స్వరాభాస్కర్ భారత వ్యతిరేక శక్తులకు మద్దతు ఇచ్చే నటిగా అన్నామలై విమర్శించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాల్గొన్న స్వరాభాస్కర్ ఆయనకు గులాబీలను ఇవ్వడాన్ని ప్రస్తావించారు. ఫిలిం ఇండస్ట్రీలో జాతీయవాద భావాలు ఉన్న నటులు బీజేపీకి మద్దతు ఇవ్వడంపై కాంగ్రెస్ గగ్గోలు పెడుతోందని ఆయన అన్నారు.
Read Also: IPL 2023: ఎంఎస్ ధోనిని ఆశీర్వదించిన మాజీ క్రికెటర్ శ్రీకాంత్
కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతు ఇవ్వడాన్ని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ.. కర్ణాటక భవితవ్యాన్ని సినీనటులు నిర్ణయించరని, ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. సినీ యాక్టర్లు ఎవరికి మద్దతు ఇవ్వాలనే స్వేచ్ఛ ఉందని, కొన్ని సార్లు ఐటీ-ఈడీ వల్ల కూడా మద్దతు ఇవ్వాల్సి వస్తోందని సెటైర్లు వేశారు. కర్ణాటకలో బీజేపీ దివాళా తీసిందని సుర్జేవాలా విమర్శించారు. 2019లో యష్, పునీత్ రాజ్ కుమార్, కిచ్చా సుదీప్ ఐటీ దృష్టి సారించింది, తన తప్పు వల్లే గతంలో ఐటీ రైడ్స్ జరిగాయని సుదీప్ గతంలో స్పష్టం చేశారు.
తాజాగా ఆయన బీజేపీకి మద్దతు విషయంపై మీడియా ప్రశ్నించింది. ఐటీ దాడుల గురించి మీరు బీజేపీలో చేరుతున్నారా..? అని ప్రశ్నించింది. దీనికి సుదీప్ బదులు ఇస్తూ.. నేను ఒత్తిళ్లు, బెదిరింపులకు భయపడే వ్యక్తిని అనుకుంటున్నారా..? నేను బసవరాజ్ బొమ్మై పై ఉన్న అభిమానంతో తాను మద్దతు ప్రకటించినట్లు వెల్లడించారు.