రాయచోటిలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ లో సంవత్సరం పాటు ఉచితంగా మూడు పూటల ఆహారం అందిస్తామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి.. రాయచోటిలో టీడీపీ నాయకులు, కార్యకర్తల సహకారంతో మూడు పూటల ఆహారం అందిస్తామని.. ఇందుకు ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించారు..
పేదలకు అన్న క్యాంటీన్ కడుపు నింపుతుంది.. అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభం అవ్వడం ఒక పండగ లాంటిది అన్నారు నటసింహా, హిందపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. శ్రీ సత్యసాయి జిల్లాలోని తన సొంత నియోజకవర్గం హిందూపురంలో ప్రభుత్వాసుపత్రి ఆవరణంలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు ఎమ్మెల్యే బాలకృష్ణ.
అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో మొదటిగా కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు.. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభంకానుండగా.. రేపు వివిధ జిల్లాల్లో మిగత 99 క్యాంటీన్లను.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు.
Telugu Desam Party: ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు అన్నా క్యాంటీన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పేదలకు తక్కువ ధరకే ఆహారం అందించేందుకు టీడీపీ నేతలు అన్నా క్యాంటీన్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. అయితే కొన్ని చోట్ల అనుమతులు తీసుకోకుండా వీటిని ఏర్పాటు చేస్తుండటంపై వివాదాస్పదం అవుతోంది. మరోవైపు అన్నా క్యాంటీన్‌ల ఏర్పాటు విషయంలో టీడీపీ నేతల్లో సమన్వయం కొరవడుతోంది. తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీలో వర్గ విభేదాలు వెలుగు చూశాయి. పోటీపోటీగా…