అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చేసింది. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా.. భారీ అంచనాలతో విడుదల అయింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అలాగే జరిగాయి.. జరుగుతున్నాయి. తెలుగులో ఈ సినిమాకు భారీ డిమాండ్ ఉంది. తెలుగులో గ్రాండ్‌గా నిర్వహించిన ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి, మహేష్ బాబు ముఖ్య అథితిగా రావడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టే.. యానిమల్…
భారీ అంచనాల మధ్య వచ్చిన యానిమల్ మూవీ… మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. చెప్పినట్టుగానే అసలు సిసలైన వైలెన్స్ చూపించిన సందీప్ రెడ్డి వంగా… ఓపెనింగ్స్ కూడా భారీగా రాబట్టాడు. అడ్వాన్స్ బుకింగ్స్‌తో అదరగొట్టిన యానిమల్… ఫస్ట్ డే వంద కోట్లను ఈజీగా టచ్ చేస్తుందని లెక్కలు వేశాయి ట్రేడ్ వర్గాలు. అనుకున్నట్టుగానే డే వన్ దాదాపు 120 కోట్లు కొల్లగొట్టినట్టుగా తెలుస్తోంది. ఒక్క ఇండియాలోనే 70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు అయినట్టుగా చెబుతున్నారు.…