భారీ అంచనాల మధ్య వచ్చిన యానిమల్ మూవీ… మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. చెప్పినట్టుగానే అసలు సిసలైన వైలెన్స్ చూపించిన సందీప్ రెడ్డి వంగా… ఓపెనింగ్స్ కూడా భారీగా రాబట్టాడు. అడ్వాన్స్ బుకింగ్స్‌తో అదరగొట్టిన యానిమల్… ఫస్ట్ డే వంద కోట్లను ఈజీగా టచ్ చేస్తుందని లెక్కలు వేశాయి ట్రేడ్ వర్గాలు. అనుకున్నట్టుగానే డే వన్ దాదాపు 120 కోట్లు కొల్లగొట్టినట్టుగా తెలుస్తోంది. ఒక్క ఇండియాలోనే 70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు అయినట్టుగా చెబుతున్నారు. హిందీలో 50 కోట్లు, తెలుగులో 10 కోట్లు, తమిళ్, కర్నాటక, కేరళ కలుపుకొని… మొత్తంగా మొదటి రోజు 60 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా కోసం 200 కోట్ల బడ్జెట్ ఖర్చు చేశారు మేకర్స్. అందుకు తగ్గట్టే భారీ బిజినెస్ చేసింది యానిమల్.
He has come to conquer all the records 🤙🏼🔥🪓#AnimalHuntBegins
Book Your Tickets 🎟️ https://t.co/kAvgndK34I#Animal#AnimalInCinemasNow #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23@imvangasandeep #BhushanKumar… pic.twitter.com/sIXDnGkfKu
— Animal The Film (@AnimalTheFilm) December 2, 2023
దాదాపు 210 కోట్ల టార్గెట్‌తో అనిమల్ సినిమా రిలీజ్ అయింది. ప్రస్తుతం థియేటర్లో యానిమల్‌దే హవా నడుస్తోంది కాబట్టి… వీకెండ్ వరకు భారీ వసూళ్లను అందుకోవడం గ్యారెంటీ. మొత్తంగా రణ్‌బీర్ కపూర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది యానిమల్. అలాగే హిందీలో 2023లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో 3వ స్థానంలో నిలిచింది. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్, పఠాన్ చిత్రాలు టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. ఇదిలా ఉంటే… అర్జున్ రెడ్డి తర్వాత పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. యానిమల్ దెబ్బకు బాలీవుడ్ హీరోలంతా సందీప్‌తో సినిమాలు చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్‌తో కమిట్ అయ్యాడు సందీప్. వచ్చే ఏడాదిలో స్పిరిట్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. 2025లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. యానిమల్‌కే పిచ్చెక్కించిన సందీప్ రెడ్డి… ప్రభాస్‌తో ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.