అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చేసింది. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా.. భారీ అంచనాలతో విడుదల అయింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అలాగే జరిగాయి.. జరుగుతున్నాయి. తెలుగులో ఈ సినిమాకు భారీ డిమాండ్ ఉంది. తెలుగులో గ్రాండ్‌గా నిర్వహించిన ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి, మహేష్ బాబు ముఖ్య అథితిగా రావడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టే.. యానిమల్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. సందీప్ రెడ్డి మరో సాలిడ్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఫస్ట్ డే 116 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది యానిమల్. ఇదిలా ఉంటే.. యానిమల్ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని సినిమా ఎండ్ లో క్లియర్ గా చెప్పేసాడు సందీప్ రెడ్డి వంగ. “అనిమల్ పార్క్”గా ఈ సీక్వెల్ అనౌన్స్ అయిపొయింది.
పోస్ట్ క్రెడిట్స్ లో వచ్చిన “అనిమల్ పార్క్” గ్లిమ్ప్స్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది. ఈ గ్లిమ్ప్స్ లో రణబీర్ ని మరింత వైల్డ్ గా ప్రెజెంట్ చేసాడు సందీప్ రెడ్డి వంగ. ఈ సీక్వెల్ గురించి పూర్తి వివరాలు తెలియనప్పటికీ, రివీల్ చేసిన పాయింట్స్ వరకూ చూస్తే… “ఇస్తాంబుల్ లో ఉండే అనిమల్ కి, ఢిల్లీ రన్ విజయ్ సింగ్ కి మధ్య వార్” ఉండేలా ఉంది. అంటే రణబీర్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తూ… రణబీర్ vs రణబీర్ వార్ గా సీక్వెల్ రూపొందనుంది. ఇద్దరు వైల్డ్ అనిమల్స్ లాంటి మనుషులు కొట్టుకుంటే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురవడం ఖాయం. కలెక్షన్స్ అనే కాదు అనిమల్ vs అనిమల్ లైన్ పై అనిమల్ పార్క్ సినిమాని డిజైన్ చేస్తే సందీప్ రెడ్డి వంగ వయొలెన్స్ అనే పదానికే కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయడం గ్యారెంటీ.