బ్రో.. ఎక్కడ బ్రో? నెల్లూరులో అందరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారు! మేరే పీఛే కౌన్ హై మాలుం అన్న నాయకుడు ఇప్పుడే పీఛే ముడ్ అన్నారు. ఇంతకూ వైసీపీ నేత, మాజీ మంత్రి ఎక్కడ? పాలిటిక్స్ నుంచి వేరే యాక్టివిటీస్‌కు షిఫ్టయ్యారా? నెల్లూరులో కూడా అంతగా కనిపించడం లేదట! ఏంటి సంగతి? అనిల్ కుమార్ యాదవ్! అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన నేత. తన చిన్నాన్న మరణంతో ఆయన రాజకీయ వారసుడిగా పాలిటిక్స్‌లోకి వచ్చారు. కార్పొరేటర్ గెలిచారు. నెల్లూరు…
ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని వైసీపీ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పల్నాడులో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో వైసీపీ నాయకులే గొడవలు చేశారు.. టీడీపీ నాయకులు చాలా మంచి వాళ్ళు అనే విధంగా పరిస్థితులను మార్చేస్తున్నారన్నారు.
పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీని గెలిపించి.. సీఎం జగన్ కు బహుమతిగా ఇవ్వాలని అచ్చంపేట మండలం కస్తలలో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కు ఘనస్వాగతం పలికిన ప్రజలు.. హారతులు పట్టారు. నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. వేల్పూరులో గత ఐదేళ్లలో 25 కోట్లతో సంక్షేమం అందించామన్నారు. రూ.2.59 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జగనన్న అమ్మఒడి ద్వారా రూ.2.18 కోట్లు అందించామన్నారు.…
కొందరు నన్ను నెల్లూరు నుంచి పంపించేశారు అని అంటున్నారు అని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుమతి తీసుకుని మళ్ళీ నెల్లూరుకు వస్తా..
తెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను బుధవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ప్రకటించింది. రేణుక చౌదరి, అనిల్‌కుమార్ యాదవ్‌కు ఏఐసీసీ అవకాశం ఇచ్చింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడే అనిల్ కుమార్ యాదవ్. దీంతో పెద్దల సభలోకి యువకుడు అనిల్ కుమార్ యాదవ్ అడుగుబెట్టనున్నారు. అయితే.. వివిధ రాష్ట్రాలలో ఫిబ్రవరి 27న జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల తొలి జాబితాను అధికారికంగా విడుదల చేసింది .…
ఫేక్‌లే పార్టీ మారతారు.. నిజంగా వైఎస్ జగన్‌ను అభిమానించేవారు పార్టీ మారరు అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్సీ అనిల్ కుమార్ యాదవ్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను చనిపోయిన తర్వాత తన శవంపై పార్టీ జెండా జగన్ కప్పాలని బహిరంగంగా చెప్పిన నేత పార్టీ మారారు.. అందుకే ఎవరిని నమ్మాలన్నా భయం వేస్తుందన్నారు.. జగన్ బాగా నమ్మినవారిలో కొందరు ఆయననే మోసం చేశారని దుయ్యబట్టారు..
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మార్పులు చేర్పులు చేస్తున్న వైసీపీ ఐదో జాబితాను విడుదల చేసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డిలు ఇంఛార్జుల మార్పును ప్రకటించారు.