రాష్ట్రంలో ఆక్సిజన్ బెడ్స్ అవైలబిలిటీ కొంచం తగ్గింది అని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. ప్రస్తుతం 113 కోవిడ్ కేర్ సెంటర్స్ లో 17 వేల మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ప్రతి జిల్లాలో టాస్క్ ఫోర్స్, ఫ్లైయింగ్ స్క్వాడ్ లు కొన్ని ఆసుపత్రుల్లో తనిఖీ చేశారు. మూడు ప్రాంతాల నుండి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ నుండి మనకు ఆక్సిజన్ అందింది. మరింత ఆక్సిజన్ అవసరం అని కేంద్రాన్ని కోరాం. కేంద్రం ఈరోజు సాయంత్రం ఆంధ్ర, కర్ణాటక, తమిళ నాడుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. రేపటికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఫీవర్ సర్వే ఏపీలో కొనసాగుతుంది. సస్పెక్టేడ్, ఫీవర్ కేసులు గుర్తిస్తున్నాం. రేపు సాయంత్రానికి ఫీవర్ సర్వే ముగిసే అవకాశం ఉంది. ఎల్లుండి కి ఫీవర్ సర్వే డాటా అందుబాటులో ఉంటుంది అని తెలిపారు. నిన్న సాయంత్రానికి 39 వేల మందికి ఫీవర్ కేసులు ఉన్నట్టు గుర్తించాం. బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయా లేదా అనే అంశం పై అనాలసిస్ చేస్తున్నాం. రేపటికి పూర్తి సమాచారం అందుతుంది. రేపు ముఖ్యమంత్రి దగ్గర కోవిడ్ నియంత్రణ పై సమావేశం ఉంది. కర్ఫ్యూ పై నిర్ణయం ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు.