ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ అద్భుతంగా ఆడింది. గత రెండు మ్యాచుల్లో ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో స్వల్ప స్కోరుకే అవుటైనప్పటికీ.. మిగతా ఆటగాళ్లు బాధ్యతను తీసుకుని ముందుకు నడిపించారు. ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్ భారీ హిట్టింగ్‌తో ముంబై స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఫలితంగా ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు…