Student Trapped: ప్రకాశం జిల్లా దోర్నాలలో దారుణం చోటుచేసుకుంది. విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడి బుద్ది వక్రమార్గం పట్టింది. దోర్నాల ఉన్నత పాఠశాలలో చదువుకునే విద్యార్థినిని ట్రాప్ చేసిన ఉపాధ్యాయుడు ప్రసాద్.. తనను ఇంట్లోకి తీసుకెళ్లాడు. విషయం తెలుసుకొని ఉపాధ్యాయుడి ఇంటికి వెళ్ళి బంధువులు ఆ టీచర్‌ను నిలదీశారు.
Read Also: Kerala Doctor Suicide: వరకట్న వివాదంతో వైద్యురాలు ఆత్మహత్య.. బాయ్‌ఫ్రెండ్ కారణమంటూ నోట్..
మాట మాట పెరిగి ఘర్షణలో విద్యార్థిని అన్నపై ఉపాధ్యాయుడు ప్రసాద్ కత్తితో దాడి చేశాడు. ఈ నేపథ్యంలో వెంటనే గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంపై విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విద్యార్థిని మైనర్ కావడంతో వివరాలు గోప్యంగా ఉంచి పోలీసులు, విద్యాశాఖ అధికారులు విచారణ చేస్తున్నారు.