CM YS Jagan: జగన్‌కు వాలంటీర్లు ఒక సైనం.. కానీ, చంద్రబాబుకు వాళ్లంటేనే కడుపు మంట అంటూ మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విజయవాడలో నిర్వహించిన వాలంటీర్ల సేవా పురస్కారాల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ వారదులు, సంక్షేమ సారథులు ఈ వాలంటీర్లు.. సేవకులు, సైనికులు ఈ వాలంటీర్లు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న సైన్యం వాలంటీర్లు.. అవినీతి, రాజకీయం చూడకుండా అందరికీ సంక్షేమం అందిస్తున్నది ఈ వాలంటీర్లు.. జగన్…
నంద్యాల జిల్లా అవుకు తిమ్మరాజు జలాశయంలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది జరిగింది. 12 మందితో వెళ్తున్న బోటు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. మరొకరు గల్లంతయ్యారు.
తెలుగుదేశం పార్టీ కోసం పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టాడని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రైతుల పరామర్శ పేరుతో చంద్రబాబుకు అనుకూల రాజకీయం చేస్తున్నాడని ఆయన విమర్శించారు.
చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. ఉండవల్లి కరకట్టపై ఆయన గెస్ట్‌హౌస్‌ను ఏపీ ప్రభుత్వం అటాచ్ చేసింది. క్రిమినల్ లా అమెండ్మెంట్ 1944 చట్టం ప్రకారం అధికారులు చర్యలు తీసుకున్నారు. స్థానిక జడ్జికి సమాచారమచ్చి లింగమనేని గెస్ట్‌హౌస్‌ను సర్కారు అటాచ్ చేసింది.
టీడీపీ, జనసేనలతో పొత్తుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పొత్తులోనే ఉన్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. టీడీపీని కలుపుకోవాలనే ప్రతిపాదనను పవన్‌కల్యాణ్‌ను తీసుకువచ్చారని.. అదే విషయాన్ని పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్లామన్నారు.
గర్భిణులకు ఆంధ్రప్రదేశ్ సర్కారు శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో గర్భిణులకు అత్యాధునిక టిఫా స్కానింగ్ సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కాన్‌ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కార్డుదారులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉచితంగా అందించనున్నారు.
ఏపీలో ప్రజలు రానున్న 3 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే 3 రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే పలుచోట్ల సాధారణ ఉష్ణోగ్రతలకంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
మన్యం దేవత.. గిరిజనుల కల్పవల్లి.. కోరికలు తీర్చే కొంగు బంగారం… ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం.. పాడేరు మోదకొండమ్మ తల్లి. అమ్మవారి మూడురోజుల ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే రెండవ గిరిజన జాతరగా పాడేరు మోదకొండమ్మ జాతర పేరొందింది.