కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారంనాడు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు.
గుంటూరు నగరంపాలెం ఎస్సై రవితేజను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటూ ఎస్సై రవితేజ తనను మోసగించారంటూ ఓ యువతి మూడు రోజుల క్రితం నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
చిత్తూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో ఆస్తి వ్యవహారంపై వివాదం చెలరేగింది. తన అన్న ఆస్తి పంచడం లేదని ఆస్తిలో అన్న తనకు రావాల్సిన వాటా అన్న ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే చిన్న కుమారుడు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన సోమవారం పుంగనూరులో చోటుచేసుకుంది.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సన్నాహక సమావేశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారు. ఈ నెల 27న ఢిల్లీలో నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే.
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. కాగా వైసీపీ ఎమ్మెల్యే గిరిధర్ తల్లి శివపార్వతి(68) గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే.
ఏపీలో అధికార పార్టీ వైసీపీ రెండో సారి అధికారంలోకి రావడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. ఎక్కడ ఏ చాన్స్ వదలకుండా అన్నింటిపై ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్. ఇప్పుడు మరో సారి అధికారం దక్కించుకోవాలని, పార్టీని పరుగులు పెట్టించాలని సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రూరల్ పరిధిలోని గాంధీనగర్లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరుతూ ఆయన నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.