Bengaluru Rains: బెంగళూర్ నగరం భారీ వర్షానికి అతలాకుతలం అయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరాయి. అండర్ పాస్ లు అన్ని నీట మునిగాయి. పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులకు రోడ్లపై చెట్లు నేలకొరిగాయి. ఇదిలా ఉంటే బెంగళూర్ వర్షానికి ఆంధ్రప్రదేశ్ కృష్టా జిల్లాకు చెందిన భానురేఖ(22) అనే యువతి మరణించింది.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి ఎన్ని ఎకరాలు ఇళ్ల పట్టాల కోసం ఇచ్చారో చెప్పాలంటూ చంద్రబాబును ఏపీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ప్రశ్నించారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలసలో ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు.
నెల్లూరు నగర వైసీపీలో విభేదాలు మరోసారి తలెత్తాయి. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మద్దతుదారుడైన హాజీపై అనిల్ వర్గీయులు దాడి చేయడంతో నగరంలో ఉద్రిక్తత నెలకొంది.
ఏపీలో పాలిసెట్-2023 ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం ఉదయం 10.45 నిమిషాలకు విజయవాడలో విద్యాశాఖ అధికారులు ఫలితాలను ప్రకటించారు. https://polycetap.nic.in వెబ్ సైట్‌లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష కోసం 1,60,329 అభ్యర్థులు నమోదు చేసుకోగా.. 1,43,592 మంది పరీక్షకు హాజరయ్యారు.