శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదిరా తిరుపతిలో భక్తుల రద్దీ బాగా ఉంది. ఎందుకంటే వేసవి సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు తిరుమలకు భారీగా చేరుకుంటున్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా టీటీడీ అధికారులు మరియు సిబ్బంది అన్ని రకాల చర్యలను తీసుకుంటూ ఉన్నారు. సోమవారం శ్రీవారి భక్తులతో తిరుమల ఎంతో రద్దీగా ఉంది. మే 29వ తేదీ సోమవారం అర్ధరాత్రి వరకు 78 వేల మంది పై గా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.దాదాపు 37,600 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలను సమర్పించుకొని వారి మొక్కులు తీర్చుకున్నారు.
సోమవారం శ్రీవారికి మూడు కోట్ల 74 లక్షల హుండీ కానుకల రూపంలో వచ్చాయని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్ది ఎక్కువ కావడంతో క్యూ కాంప్లెక్స్ నిండిపోయి క్యూ లైన్లు తిరుమల లోని టీబీసీ కాటేజ్ వరకు అయితే వచ్చాయి. ప్రత్యేక దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు వారికి కేటాయించిన సమయంలోనే స్వామివారి దర్శనం కలుగుతుందని సమాచారం.సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతుందని టిటిడి అధికారులు వెల్లడించారు. అలాగే క్యూ లైన్ లో ఉన్న భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి ఓపికగా ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి దర్శనం అవుతుందని అంతవరకు సహనంతో ఉండాలని టిటిడి అధికారులు విజ్ఞప్తి చేశారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి కాంప్లెక్స్ లో ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు అలాగే తాగునీరు అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు. వేసవి సెలవులు పూర్తికావస్తున్న సమయంలో విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వేల సంఖ్యల్లో తిరుమల చేరుకుంటున్నారు.వేసవి సెలవులు పూర్తీ అయ్యేవరకు తిరుమలలో భక్తుల రద్దు బాగా ఎక్కువగా ఉంటుందని టిటిడి అధికారులు చెబుతున్నారు. జూన్ నెలలో తిరుమల లో విశేషా ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరు అవుతారని టీటీడీ అధికారులు కూడా అంచనా వేస్తున్నారు.