ఏపీ వ్యాప్తంగా గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేయలేమని హైకోర్టుకు తెలిపింది ఎన్నికల సంఘం.. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, ఈ సమయంలో వేరే వారికి ఇచ్చిన సింబల్ మార్చలేమని కోర్టుకు తెలిపిన ఈసీ.. ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని పేర్కొంది.
కాపులకు తానెప్పుడూ అండగా నిలిచానన్నారు. మరోసారి తనకు అండగా ఉండి ఆశీర్వదిస్తే.. నియోజకర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాను అని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చెప్పుకొచ్చారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం చోటు చేసుకుంది.. రాయచోటిలోని కెనరా బ్యాంకుకు పెన్షన్ కోసం వెళ్లి బ్యాంక్ ముందు కుప్పకూలిన వృద్దుడు అక్కడికక్కడే కన్నుమూశాడు.. మృతుడు సుబ్బన్న (80)గా గుర్తించారు. లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారం గ్రామం పిచ్చిగుంటపల్లెకుకు చెందిన ముద్రగడ సుబ్బన్న.. పెన్షన్ కోసం వెళ్లి.. బ్యాంకు వద్ద కుప్పకూలి మృత్యువాత పడ్డారు
చంద్రబాబు నాయుడుకి ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన ఎందుకు వచ్చిందో గాని ప్రజలకు మేలు చేస్తే సహించలేడు అంటూ కైకలూరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో పెన్షన్దారులకు కష్టాలు తప్పడం లేదు.. గత నెలలో గ్రామ/వార్డు సచివాలయ దగ్గర పడిగాపులు పడిన వృద్ధులు.. ఇప్పుడు బ్యాంకుల దగ్గర క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది.. మే 1వ తేదీ నుంచి అంటే నిన్నటి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా పెన్షన్ డబ్బులు జమ చేస్తూ వస్తుంది ప్రభుత్వం.. ఈ రోజు, రేపు కూడా ఈ కార్యక్రమం కొనసాగనుంది.. ఇక, ఆన్లైన్ లేనివారికి నేరుగా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేయనున్నారు అధికారులు..
త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే.. ప్రజలకు అండగా ఉండి మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు తెలిపారు.