ఈ రోజు ఉదయం 10 గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగించనున్న జగన్.. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్సభ స్థానం పరిధిలోని పలమనేరులో పర్యటిస్తారు.. స్థానిక బస్టాండ్ సెంటర్లో జరిగే సభకు హాజరై సభనుద్దేశించి ప్రసంగించనున్నారు.. ఇక, ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని నెల్లూరు సిటీలో జగన్ పర్యటన కొనసాగనుంది.. గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు…
విజయవాడ వ్యాపార రంగానికి వస్త్రలత ఒక ల్యాండ్ మార్క్ వంటిదని కేశినేని శ్వేత అన్నారు. వస్త్రలత కార్మికుల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని.. వైఎస్సార్సీపీ కార్మికుల, కర్షకుల పక్షపాత పార్టీ అని వ్యాఖ్యానించారు.
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ నేతలు ప్రచారంలో జోరు పెంచారు. గడపగడపకు తిరుగుతూ తమకు ఓటేయాలని ప్రజలను కోరుతున్నారు. తాము అధికారంలోకి వస్తే.. సంక్షేమం, అభివృద్ధి పథకాలను తీసుకొస్తామంటూ చెబుతూ ముందుకెళ్తున్నారు.
ఏపీలో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. రేపు 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు,169 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఎల్లుండి 78 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 273 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం దాసరి పల్లి గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీలో చేరారు. పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో వీరంతా పసుపు కండువా కప్పుకున్నారు. మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బయన్న ..రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి తో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. పెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలపై తనకు, సీఎం జగన్కు అమితమైన ప్రేమ ఉందని.. అందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టామన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. బహిరంగ సభలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. కూటమిపై పార్టీలపై విమర్శలు ఎక్కుపెడుతూ ప్రచారపర్వంలో ముందుకెళ్తున్నారు జగన్. పెన్షన్ల విషయంలో రాజకీయం చేస్తున్నారని విపక్షాలపై మండిపడుతున్నారు.
పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గౌరు చరిత రెడ్డి ప్రచారం ఉధృతం చేశారు. 2014లో పాణ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాక నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
ఎండలను సైతం లెక్కచేయకుండా ఆప్యాయత, అనురాగాలు చూపిస్తున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పదిరోజుల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుందని.. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు అని సీఎం పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు.