Elections 2024: పార్లమెంటు ఎన్నికల వేళ హైదరాబాద్‌లో సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు.. భారీగా డబ్బు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు చేసిన పోలీసులు.. అనుమానాస్పదంగా ఉన్న రెండు హోండా యాక్టివా వాహనాలను పట్టుకున్నారు. లెక్కల్లో చూపని 22 లక్షలు స్వాధీనంచేసుకున్నారు. మేడ్చల్ టౌన్ లో వాహన తనిఖీలు చేసిన SOT పోలీసులు.. SISCO సేఫ్ గార్డ్ వాహనంలో 5 సీల్డ్ బాక్స్‌లలో దాదాపు 25 లక్షల డబ్బు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు…కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్ దేవ్ హాస్పిటల్ సమీపంలో వాహన తనిఖీలు చేసిన పోలీసులు..4 కేజీల బంగారం, 4 కిలోల వెండి, స్వాధీనంచేసుకున్నారు. వీటి విలువ 2 కోట్ల 66 లక్షల పైచిలుకు ఉంటుందని అంచనా.
Read Also: Varalaxmi Sarathkumar :పెళ్లికి రెడీ అయి ఇప్పుడేంటి ఇలా అనేసింది?
ఇక, ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని టీడీపీ నేత ఇంట్లో భారీగా సొమ్మును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు.గొల్లపూడిలోని ఆలూరి సురేష్ ఇంటిలో కోటి రూపాయలను సీజ్ చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో డబ్బు పంపకాలు జోరుగా సాగుతున్నాయి. కంటోన్మెంట్ బోయిన్ పల్లిలో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ గణేష్ ను గెలిపించడానికి డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. పెద్దసంఖ్యలో బీజేపీ కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో…కాంగ్రెస్ కార్యకర్తలు పరారయ్యారు. మరోవైపు.. ఎన్టీఆర్ జిల్లా ఆంధ్ర సరిహద్దు జగ్గయ్యపేట మండలం గరికపాడు సరిహద్దు వద్ద.. తాజాగా భారీగా నగదు సీజ్ చేశారు.. హైదరాబాద్ నుండి గుంటూరుకు లారీలో భారీగా క్యాష్ తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.. దీంతో.. తనిఖీలు విస్తృతంగా చేశారు.. ఆ తనిఖీల్లో ఓ లారీలో తరలిస్తున్న 8.39 కోట్ల రూపాయలు పోలీసులు పట్టుకున్నారు.. ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న సొమ్మును సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించారు.. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకొని విచారణ జరుగుతున్నారు. ఇలా ఎక్కడ పట్టుబడిన.. భారీగా నోట్ల కట్టలు, బంగారం, వెండి కడ్డీలు.. లిక్కర్ బాటిళ్లు.. పెద్ద సంఖ్యలో పట్టుపడుతూనే ఉన్నాయి.