వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా పథకాలు అందించామన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో 20 నుంచి 30 కోట్ల రూపాయలు ప్రజలకు చేరాయన్నారు.
ఎన్నికల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నుంచి 626 ప్రత్యేక సర్వీసులు అందిస్తుంది. అంతేకాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా బెంగళూరు నుంచి 200 ప్రత్యేక సర్వీసులు నడపనుంది. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల నుంచి రెగ్యులర్ సర్వీసులు ఫుల్ కాకపోవడంతో ప్రత్యేక సర్వీసులు లేవు. మరోవైపు.. 10వ తేదీ శుక్రవారం కావడం.. అలాగే శని, ఆది వారాలు సెలవులు ఉండటంతో అత్యధికంగా 199 సర్వీసులు హైదరాబాద్ నుంచి, 95 సర్వీసులు బెంగళూరు నుంచి రాష్ట్రంలోని…
ఉదయగిరి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారానికి ఇంకా రెండు రోజులే గడువు ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఉదయగిరి మండలం సంజీవ రాజుపల్లి గ్రామం నుంచి బుధవారం పల్లె పల్లెకు కాకర్ల ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై వైసీపీ నేక పోతిన మహేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ మార్పు కోసం వచ్చాడని అందరం భావించాం.. కానీ ప్యాకేజీ తీసుకుని చంద్రబాబుకు ఊడిగం చెయ్యటానికి వచ్చాడని ఈ మధ్యే అర్థం అయిందని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమయంలో డీబీటీ పథకాల అమలుపై ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఈసీ లేఖ రాసింది.. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే బటన్ నొక్కి వివిధ పథకాలకు నిధులు విడుదల చేశారన్న ఎన్నికల కమిషన్.. రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాలకు వెళ్లాల్సిన నిధులు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో చేరలేదని పేర్కొంది.. లబ్ధిదారుల ఖాతాలకు నిధుల జమలో జరిగిన జాప్యంపై వివరణతో…