ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది.. రేపు ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రారంభించి ఫలితాలను ప్రకటించనున్నారు.. అయితే, కౌంటింగ్ సందర్భంగా అప్రమత్తమయ్యారు పోలీసులు.. ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వారిపై నిఘా పెట్టారు.. ఈ రోజు సాయంత్రం నుంచి కౌంటింగ్ ముగిసే వరకు 126 మంది రౌడీ షీటర్స్ ను గృహనిర్బంధం చేయాలని నిర్ణయించారు. కడప జిల్లా వ్యాప్తంగా 1,038 మంది రౌడీలకు ఇప్పటికే పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.
కృష్ణా జిల్లాలో పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మచిలీపట్నం పార్లమెంటు, 7 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు 14 చొప్పున కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ మహిళా కానిస్టేబుల్ వేదవతి (29) ఆత్మహత్య చేసుకుంది. ఎస్పీ కార్యాలయంలోని సెక్యూరిటీ గార్డ్ రూమ్‌లో తన వద్ద ఉన్న సర్వీస్ తుపాకితో కాల్చుకొని ఏఆర్ మహిళా కానిస్టేబుల్ వేదవతి ఆత్మహత్య చేసుకుంది.
జూన్ 4న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కడప నగరంలో ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ వెల్లడించారు. నగర శివార్ల నుంచి బస్సులు, ఇతర వాహనాల దారి మల్లింపులు ఉంటాయన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 10 ఏళ్లు అయిందని.. రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటేనన్నారు. 10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలన్నదే నా ఆకాంక్ష అని అన్నారు.
ఎన్నికల ఫలితాలపై వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితులు వేరని.. మాకు ప్రజలపై అపారమైన నమ్మకం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎగ్జిట్ పోల్‌తో సంబంధం లేదని.. 36 గంటలు ఆగితే కరెక్ట్ రిజల్ట్ వస్తుందన్నారు.