Margani Bharat: ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకున్నారో.. మేం ఏం తప్పులు చేసామో తెలియటం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Margani Bharat: అభివృద్ధి చేసినా ప్రజల అభిమానాన్ని ఓట్ల రూపంలో పొందలేకపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎంపీ మార్గాని భరత్.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజలకు మంచి చేయాలనే ముఖ్యమంత్రి ఆలోచనను ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకున్నారో అర్థం కావట్లేదు.. ఏం తప్పులు చేసామో తెలియటం లేదన్నారు. రెల్లి పేటలో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా వైయస్సార్ వెనుకే జనం ఉంటారు.. అక్కడ కూడా ఎలా తక్కువ వచ్చింది అర్థం కావటం లేదు అన్నారు. రాజమండ్రిని సొంత ఇల్లులా భావించాను.. సొంత కార్యక్రమాలకు, వ్యాపారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా జనం మధ్యలోనే గడిపాను.. ఎంతోమంది నాయకులు ఎంపీలు, మేయర్లు అయ్యారు రాజమండ్రిలో ఈ తరహా డెవలప్మెంట్ ఎప్పుడు జరగలేదన్నారు భరత్.
Read Also: Road Accident : ఘోర ప్రమాదం.. భక్తులతో నిండిన బస్సు బోల్తా.. ఇద్దరు మృతి.. 35 మందికి గాయాలు
Also Read
- LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
- Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
- UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
ఇక, రాజమండ్రిలో మోరంపూడి శిలాపలకాన్ని టీడీపీ నేతలు కూల్చేసినా ఎమ్మెల్యే వ్యంగ్యంగా మాట్లాడటం దారుణం అన్నారు భరత్.. శిలాపలకం కూల్చేసి క్రమశిక్షణకు మారుపేరని చెప్పటం ఎంతవరకు కరెక్ట్..? అని ప్రశ్నించారు. అమరావతి రైతులు నిజమైన రైతులు కాదు.. రైతుల రూపంలో ఉన్న టీడీపీ మూకలు రాజమండ్రిలో మాపై దాడి చేశారు.. దానిని మాత్రమే ప్రతిఘటించామని గుర్తుచేసుకున్నారు. అమరావతిలో కూల్చేసిన ప్రజావేదిక ఎన్జీటీ గైడ్ లైన్స్ కు విరుద్ధంగా ఉందన్న ఆయన.. ఉండ్రాజవరం, జొన్నాడ, కైకలూరు, తేతలి నాలుగు ఫ్లై ఓవర్లు మంజూరు చేసిన జీవో కాపీలు కూడా చూపించాం.. నాలుగు ఫ్లైఓవర్లకు సంబంధించి 345 కోట్ల రూపాయలు 2020లోనే మంజూరు చేశారు.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలపై చాలా బాధ్యత ఉంది అన్నారు. తమకు ఇంకా మంచి చేస్తారని ప్రజలు భావించి వారికి విజయాన్ని కట్టబెట్టారు.. ఇచ్చిన హామీలు ఎంతమేర నిలబెట్టుకుంటారో చూద్దాం అన్నారు రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన్ని భరత్.
తాజావార్తలు
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
-
UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!