ఆంధ్రప్రదేశ్ గెలిచింది.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిచారు.. ఇవాళ నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది.. టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమికి సేవ చేసేందుకు అఖండమైన ఆదేశంతో ఆశీర్వదించినందుకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు..
గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఏపీ సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ సెలవులపై విదేశాలకు వెళ్లేందుకు సిద్ధం అయ్యారు.. ఈ నెల ఆరో తేదీ నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకు వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లనున్నారట సంజయ్.. ఇక, సెలవుపై వెళ్లేందుకు సంజయ్ కు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్ది మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు నూతన అధ్యాయనికి శ్రీకారం చుట్టారు.. వైసీపీకి డబుల్ డిజిటల్ కూడా దక్కకపోవడాన్ని చూస్తే ప్రజా వ్యతిరేకత ఎంత ఉందో అర్ధం అవుతుందన్నారు.
ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం కౌంటింగ్ సెంటర్ దగ్గర మరోసారి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కౌంటింగ్ లో అవకతవకలు జరుగుతున్నాయని వైసీపీ, టీడీపీ పార్టీలకు చెందిన ఏజెంట్ల పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి.
ఏపీలో ఫలితాల్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. కూటమికి భారీ ఎత్తున సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం చతికల పడింది. దీంతో ఈ రోజు ముఖ్యమంత్రి పదవికి ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజీనామా చేశారు.
గుంటూరు పట్టణంలోని సాయిబాబా రోడ్డు దగ్గర మౌరియా ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి విడదల రజినీ, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయాలపై టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున దాడులకు దిగారు.
ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. టీడీపీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజల విజయమని .ప్రజలే టీడీపీని గెలిపించారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. టీడీపీ గెలుపు దిశగా పయనిస్తుండగా.. మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారాలోకేష్ ఘన విజయం సాధించారు.