ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తేరుకోలేకపోతున్నారు.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం.. ప్రజల తీర్పుతో ఆశ్చర్యం కలుగుతోంది.. బాధ కూడా కలుగుతోందన్నారు.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో.. ఈవీఎం ధ్వంసంతోపాటు, మరికొన్ని కేసుల్లో పిన్నెల్లిని అరెస్టు చేసే అవకాశం కనిపిస్తుంది.. ప్రస్తుతం నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో పిన్నెల్లి బస చేసినట్టు గుర్తించిన పోలీసులు.. ఆయన కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు.
మా ప్రయాణం ఎన్డీఏతోనే అని స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. మేం ఎన్డీఏలో ఉన్నాం.. ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నా.. ఎన్డీఏ సమావేశానికి హాజరవుతున్నాం అని వెల్లడించారు.
కీలక నిర్ణయం తీసుకున్నారు ముద్రగడ పద్మనాభం.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్లు రెడీ చేసుకున్నాను.. సవాలులో నేను ఓడిపోయాను కాబట్టి.. నా పేరు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నాను అన్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరోసారి పాత సెంటిమెంట్ రిపీట్ అయ్యింది.. ఓ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన వారు.. తర్వాత ఎన్నికల్లో ఓటమి చెందుతారనే సెంటిమెంట్ కృష్ణా జిల్లాల్లో మరో సారి రిపీట్ అయ్యింది.. దానికి వైఎస్ జగన్ కేబినెట్లో జిల్లా నుంచి మంత్రులుగా పని చేసిన అందరూ పరాజయం చవిచూశారు..
టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సూపర్ విక్టరీ సాధించింది.. దీంతో.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వేదికగా ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం జరగనుంది.. ఈ సమావేశంలో పాల్గొనేందుకు హస్తినబాట పట్టనున్నారు టీడీపీ చీఫ్.. ఇక, ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..