సుమారు 30 కోట్ల నుంచి 35 కోట్ల రూపాయలపైనే ఆ మధ్యవర్తి వద్ద పందాలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు ముగిసిన తర్వాత పందాల్లో గెలిచిన వ్యక్తులు తమకు డబ్బులు వస్తాయని ఆనందంలో మునిగితేలారు.. ఎంతో ఆశగా పందెంలో గెలిచిన డబ్బు కోసం మధ్యవర్తి వద్దకు వెళ్తే ఆ మీడియేటర్ కాస్త అడ్రస్ లేకుండా పోయాడు.
ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సంచలన ఆరోపణలు చేశారు.. ఏపీ కాంగ్రెస్ అధిష్టానం కార్యకర్తలను అన్యాయం చేసిందన్న ఆమె.. నచ్చిన వారికి ఎన్నికల్లో పార్టీ ఫండ్ ఇచ్చారు.. ఎందుకు? వాళ్లు ఢిల్లీ వెళ్ళి షర్మిల భజన చేస్తారనా? అని నిలదీశారు..
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎం ధ్వంసం సహా మరో మూడు కేసులు పిన్నెల్లిపై పల్నాడు పోలీసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మార్చాలని వైసీపీ నిర్ణయించింది. ప్రస్తుతం జగన్ క్యాంపు కార్యాలయమును వైసీపీ పార్టీ కార్యాలయంగా మార్చాలని నిర్ణయం తీసుకుంది.
అమరావతి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరారు. తన పర్యటన సందర్భంగా పోలీసు ట్రాఫిక్ ఆంక్షలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పర్యటన సందర్భంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ ఆపొద్దని నిన్ననే(బుధవారం) చంద్రబాబు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును నిలుపుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలోని సలహాదారులను అందర్నీ ఏపీ ప్రభుత్వం తొలగించింది. మొత్తంగా 40 మంది సలహాదారులను తొలగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 4వ తేదీ నుంచి తొలగింపు ఉత్తర్వుల్లో జీఏడీ వెల్లడించింది.
ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక టీడీపీ నేతలు బీహార్ తరహా హింసా రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నేతలు గురువారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఈ దాడుల గురించి ఫిర్యాదు చేశారు.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో పల్నాడుతో టెన్షన్ కొనసాగుతోంది. నరసరావు పేటలో పిన్నెల్లి ఉంటున్న గృహం చుట్టూ పోలీసులు మోహరించారు. కోర్టు ఆదేశాల ప్రకారం సంతకం చేసేందుకు కొద్దిసేపటి క్రితం ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మరోవైపు పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది.