తిరుమలలో ఓ భారీ పాము హల్చల్ చేసింది. దాదాపు 7 అడుగులుండే ఓ జెర్రిపోతు భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. వెంటనే పాము సంచరిస్తుందని టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. పాములు పట్టే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని భారీ సైజుతో ఉన్న పామును పట్టుకున్నారు. స్థానికులు తిరిగే డీ టైప్ క్వార్టర్స్ వద్ద ఈ పామును గుర్తించారు. తరువాత దూరంలో అటవీ ప్రాంతంలో జెర్రిపోతు పామును వదిలేశారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆర్టీసీ బస్సులను రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డీజిల్ రెట్లు తగ్గినా కూడా బస్సు చార్జీలు పెంచిన ఘనత జగన్ ది అని ఆరోపించారు. జగన్ మాటలు ప్రజలు వినే పరిస్థితి లేదని అన్నారు. మరోవైపు.. శాఖల్లో ఏదైనా అవినీతి జరిగి ఉంటే, తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా.. ఏ రాజకీయ సభలకు ఫ్రీగా బస్సులు ఉపయోగించమని అన్నారు.