గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయకపోవడం దారుణం అని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎయిర్ పోర్ట్ టెర్మినల్ అభివృద్ధి పనులను సంవత్సరంలోపు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు.
భీమవరం మున్సిపల్ శాఖ పరిధిలో ఉంటుంది.. ఈ ప్రాజెక్టు అమలు విషయమై మంత్రి నారాయణతో మాట్లాడుతాం.. చెత్తలో కూడా ఐశ్వర్యం ఉందని చెప్పడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం అని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఎంఏ బేబీ మాట్లాడుతూ.. హిందూ రాష్ట్ర అనే ఆలోచన ఉన్న ఆర్ఎస్ఎస్ విధానాలతో కూడిన దేశం వైపు మార్చాలని చూస్తున్నారు.. 2025 నాటికి ఇండియాను మైనారిటీ వ్యతిరేక దేశంగా.. అఖండ హిందూ దేశంగా ప్రకటించాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ అని ఆయన ఆరోపించారు. 2025 నాటికి ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్లు అవుతుందని తెలిపారు.
Gudivada Amarnath: ఉత్తరాంధ్రపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిది సవతి తల్లి ప్రేమ అని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేస్తారో చెప్పకుండా వైసీపీని నిందించడానికి పరిమితం అయ్యారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ ప్రపంచంలో మరే రాజకీయ నాయకుడికి ఉండవు అంటూ మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు ఉన్న భూ సమస్యలు సహా అన్ని పరిష్కరించి వైసీపీ ప్రభుత్వం హయాంలో…
కృష్ణా జిల్లాలోని గన్నవరం పరిధిలోని బాపులపాడు హైవేపై పైవేట్ ట్రావెల్స్ బస్సు నిలిచిపోవడంతో ప్రయాణీకులు నానా అగచాట్లు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచి హైవే పైనే బస్సు నిలిచిపోయింది. అయితే, బస్సులో దాదాపు 36 మంది ప్రయాణికులు ఉన్నారు.
9th Class Girl Murder: కర్నూలు జిల్లాలోని ముచ్చుమర్రిలో అత్యాచారం, హత్యకు గురైన బాలిక మృతదేహం కోసం 4వ రోజు కూడా పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక మస్థ్యకారుల సహాయంతో కలిసి వెతుకుతున్నారు. జులై 7వ తేదీ నుంచి బాలిక కనిపించకుండా పోయింది.