Physical Harassment: ఏపీలో మరో ఘటన.. వాష్ రూమ్‌లో విద్యార్థినికి వేధింపులు..! లెక్చరర్‌పై ఫోక్సో కేసు..
- విద్యార్థినికి లైంగిక వేధింపులు..
- అడ్డతీగల జూనియర్ కాలేజ్ లెక్చరర్‌పై ఫోక్సో కేసు..
- వాష్ రూమ్ కి వెళ్తున్న విద్యార్థిని వెంపడిన లెక్చరర్..
- విద్యార్థినిపై చేతులు వేసి అసభ్యప్రవర్తన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Physical Harassment: ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారులు, విద్యార్థినిలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి.. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు, లెక్చరర్లు.. కామాంధులుగా మారిపోయి.. విద్యార్థినిపట్ల వికృతంగా ప్రవర్తిస్తున్నారు.. అలాంటి ఓ లెక్చర్‌పై తాజాగా కేసు నమోదు చేశారు పోలీసులు.. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల జూనియర్ కాలేజీలో చోటు చేసుకున్న లైంగిక వేధింపుల కేసుకు సంబంధించని పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అడ్డతీగల జూనియర్ కళాశాలకు చెందిన రామకృష్ణ అనే అధ్యాపకుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.. ఓ విద్యార్థిని వెంటపడుతూ లైంగిక వేధింపులకు గురిచేసినట్టు రామకృష్ణపై అభియోగాలు మోపారు.. వాష్ రూమ్ కి విద్యార్థిని వెళ్తుండగా వెంటపడిన రామకృష్ణ.. ఆమె శరీరంపై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు.. అడ్డుచెప్పిన విద్యార్థిని మెడను గట్టిగా నొక్కి ఇబ్బంది పెట్టాడు.. భయాందోళనకు గురైన విద్యార్థిని.. అధ్యాపకుడిని ప్రాధేయపడింది.. ఎంత చెప్పినా వినకపోవడంతో.. అతని బారినుంచి తప్పించుకున్న ఆమె.. హాస్టల్ కు పరుగులు తీసింది.. అయితే, ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే తమ కూతురు మానసికంగా కృంగి పోయి ఉండడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు.. దీంతో.. కాలేజీలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది..
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
Read Also: Gautam Gambhir Farewell Note: నేను ప్రతిరోజు ఓడిపోతాను కానీ.. గౌతమ్ గంభీర్ ఎమోషనల్ వీడియో!
ఇక, తోటి విద్యార్థినిలు తమ సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది.. విద్యార్థిని, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అడ్డతీగల పోలీసులు.. అధ్యాపకుడు రామకృష్ణపై కేసు నమోదు చేశారు.. ఈ ఘటనలో ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు.. రామకృష్ణపై ఫోక్సో కేసు పెట్టారు.. మరోవైపు.. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.. వేధింపులకు ఒక విద్యార్థిని బయటపెట్టింది.. రామకృష్ణ వేధింపులపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని.. విద్యార్థుల్లో మనో ధైర్యాన్ని నింపాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి