Minister Kollu Ravindra: త్వరలోనే నూతన మద్యం పాలసీ..
- త్వరలోనే నూతన మద్యం పాలసీని ప్రకటిస్తామన్న ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర..
- కుటుంభసభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి..
- గత పాలకులు సాగించిన ఆరాచకాలను శ్వేతపత్రాల రూపంలో ప్రజలకు వివరిస్తున్నాం..
- త్వరలోనే మద్యం మరియు ఆర్థిక శాఖపై శ్వేత పత్రాలు ఉంటాయని ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kollu Ravindra: త్వరలోనే నూతన మద్యం పాలసీని ప్రకటిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనార్థం కుటుంభసభ్యులతో కలసి తిరుమల విచ్చేసిన కొల్లు రవీంద్ర.. ఇవాళ వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశ్వీరదించగా.. అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర.. రాష్ట్రాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధోగతి పాల్జేసిందని మండిపడ్డారు.. గత పాలకులు సాగించిన ఆరాచకాలను శ్వేతపత్రాల రూపంలో ప్రజల ముందు వుంచుతున్నామని తెలిపారు.. ఇక, త్వరలోనే మద్యం మరియు ఆర్థిక శాఖకు సంబంధించిన శ్వేత పత్రాలను కూడా విడుదల చేయనున్నట్టు వెల్లడిండారు మంత్రి కొల్లు రవీంద్ర..
Read Also: Sikkim : పశ్చిమ బెంగాల్‌లోని కాలువలో దొరికిన సిక్కిం మాజీ మంత్రి మృతదేహం
Also Read
మరోవైపు.. మా మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ఐదు సంవత్సరాల పాటు స్వచ్ఛమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి రవీంద్ర.. గత పాలకులకు కొంత మంది అధికారులు వత్తాసు పలికి.. అవినీతిలో తమ వంతు పాత్ర పోషించాచారని .. వారందరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి కొల్లు రవీంద్ర.. కాగా, గత ప్రభుత్వ హయాంలో.. ప్రభుత్వమే వైన్ షాపులను నిర్వహించిన విషయం విదితమే.. ఇప్పటికే అదే విధానం కొనసాగుతుండగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి కొత్త లిక్కర్ పాలసీ తర్వాత మార్పులు జరగనున్నాయి. ప్రభుత్వ మళ్లీ పాత విధానాన్ని తీసుకొస్తుందా.. ? గత ప్రభుత్వాన్ని ఫాలో అవుతుందా చూడాలి.. ఇక, నకిలీ లిక్కర్ అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారనే విమర్శలు గత ప్రభుత్వంపై లేకపోలేదు.
తాజావార్తలు
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!